భగత్ సింగ్ కోసం వెయిటింగ్ తప్పేలా లేదు
ఏపీ ఎలక్షన్స్ అయిపోగానే పవన్ కళ్యాణ వరుసబెట్టి షూటింగుల్లో పాల్గొననున్నాడు. ఒకవేళ టీడీపీ జనసేన బిజెపి కూటమి అధికారంలోకి వస్తే పవన్ ఓ నెల తర్వాత ఫ్రీ అవుతాడు. అంటే జూన్ నుంచి ఓజీ సినిమాకు వరుసగా డేట్స్ ఇచ్చే ఛాన్సుంది. ఆ మేరకు డైరెక్టర్ సుజిత్ ఓజీ షూటింగ్ ను ప్లాన్ చేసుకున్నాడు.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికొస్తే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ అయ్యాక బ్రేక్ పడింది. సినిమా పూర్తవడానికి బాగా టైమ్ పడుతుందని డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే లోపు షూటింగ్ పూర్తి అయిపోతుంది.
ఈ సినిమా తర్వాత చిరంజీవి, హరీష్ కాంబోలో సినిమాను లాక్ చేసేందుకు మిస్టర్ బచ్చన్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెగ కష్టపడుతోంది. సుస్మిత కొణిదెల పార్టనర్‌గా ఈ కాంబో దాదాపు కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ 2025లో తప్ప అంతకంటే ముందు రీస్టార్ట్ అవదు. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం శ్రీలీల కొత్త డేట్స్ ను కూడా టీమ్ తీసుకోలేదు. మెయిన్ విలన్ ను ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. ఇవన్నీ చూస్తుంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్యాన్స్ కు వెయిటింగ్ తప్పేలా కనిపించడం లేదు.













