లోకేష్ మాటలతో స్టార్ హీరోలకు నిరాశ
ఖైదీ, విక్రమ్ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న లోకేష్ కనగరాజ్‌కు ఆ రెండు సినిమాలతో ఎంతో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోలందరూ లోకేష్ తో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. లోకేష్ ఓకే అనాలే కానీ వచ్చి వాలిపోవడానికి హీరోలంతా రెడీగా ఉన్నారు. సూపర్స్టార్లు సైతం లోకేష్ తో పని చేయడానికి లైన్ లో ఉన్నారంటే లోకేష్ రేంజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు లాక్ చేసుకుంటే మరో రెండేళ్లకైనా తనతో సినిమా చేయొచ్చులే అని కొంతమంది హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు. నిర్మాతలు సైతం లోకేష్ చుట్టూ అడ్వాన్సులు పట్టుకుని తిరుగుతున్నారు. ఇంత క్రేజ్ ఉన్న లోకేష్ రీసెంట్ గా 10 సినిమాలు చేశాక ఇండస్ట్రీని వదిలేస్తానని వెల్లడించి అందరినీ షాకయ్యేలా చేశాడు.
తాజాగా విజయ్ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఈవెంట్లో పాల్గొన్న లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాకిక్కడ ఎక్కువ కాలం ఉండాలని లేదు. దీర్ఘ కాలిక ప్రణాళికలు లేవు. డైరెక్టర్ అనే పొజిషన్ ను ఎక్కువ కాలం పట్టుకుని ఉండాలనుకోవట్లేదు. నేను ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నా సినిమా అనేది ఎంత కష్టమైన పననేది ఇండస్ట్రీలోని అందరికీ తెలుసు. అందుకే ఈ 10 సినిమాల తర్వాత మానేస్తున్నా అని మాట్లాడాడు లోకేష్.
ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు ఇండస్ట్రీకి వచ్చారనుకోవచ్చు. సినిమాల్లో ట్రై చేయాలని షార్ట్ ఫిల్మ్ చేశా. అవి బాగా క్లిక్ అవడంతో డైరెక్టర్ గా ఛాన్స్‌లొచ్చాయి. అందుకే కొన్నాళ్ల పాటూ ఈ వృత్తిలో కొనసాగి తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని ఎంచుకుంటానని లోకేష్ వ్యాఖ్యానించాడు. లోకేష్ ఇంత క్లారిటీగా మాట్లాడటంతో తన మీద ఆశలు పెట్టుకున్న స్టార్ హీరోలందరి ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది.













