కూలీ క్యామియోలపై డిపెండ్ అవుతున్నాడా?
తన సినిమాలతో సౌత్ లో విపరీతమైన డిమాండ్ ఏర్పరచుకున్న దర్శకుల్లో లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ఒకరు. తన కథలు కొత్తగా లేకపోయినా స్క్రీన్ ప్లే, ఈ తరానికి నచ్చేలా సినిమాలు తీయడంలో తనకు తానే సాటి. అందుకే లియో(Leo) సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. లియో కలెక్షన్స్ విషయంలో విజయ్(Vijay) క్రేజ్ కంటే లోకేష్ బ్రాండే ఎక్కువగా పని చేసింది.
లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజినీకాంత్(Rajinikanth) తో కూలీ(Coolie) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా బంగారం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో ఉపేంద్ర(Upendra), నాగార్జున(Nagarjuna) కీలక పాత్రలు చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. వారి పాత్ర నిడివి ఎంత ఉంటుందో తెలియదు కానీ పాత్రలకు ప్రాధాన్యత మాత్రం బాగా ఉంటుందని టాక్.
అయితో లోకేష్ వారిద్దరితో ఆగకుండా కూలీ కోసం బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్(Amir Khan) ను కూడా రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఆల్మోస్ట్ ఫిక్స్ అంటున్నారు. ఇదే నిజమైతే బాలీవుడ్ లో కూలీకి మంచి బూస్ట్ దొరికినట్లే. అయితే ఇవన్నీ చూశాక లోకేష్ మరీ ఎక్కువగా క్యామియోలపై ఆధారపడుతున్నాడేమో అంటున్నారు కొందరు. కథ మీద కూడా లోకేష్ కసరత్తులు చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.













