డార్లింగ్ మూవీతో లోకేష్ టాలీవుడ్ ఎంట్రీ?
సౌత్ లో మంచి డిమాండ్, క్రేజ్ ఉన్న డైరెక్టర్ల లిస్ట్ లో లోకేష్ కనగరాజ్ పేరు కూడా ఉంటుంది. స్క్రీన్ ప్లే, స్టైలిష్ మేకింగ్ తో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసే లోకేష్ ప్రస్తుతం రజినీకాంత్ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం వెట్టయాన్ షూటింగ్ లో ఉన్న సూపర్ స్టార్ ఆ సినిమా పూర్తవగానే లోకేష్ సినిమా సెట్స్ లో జాయిన్ అవుతాడు.
ఈ లోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యేలా లోకేష్ ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో లోకేష్ ఓ సినిమా చేస్తానని గతంలోనే చెప్పాడు. ఇప్పుడు ఆ సినిమా సడెన్ గా వార్తల్లోకొచ్చింది. తాజాగా లోకేష్ బర్త్ డే సందర్భంగా కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ తనకు విషెస్ చెప్తూ అనౌన్స్మెంట్ ఇచ్చింది. అయితే అందులో హీరో, మిగిలిన వివరాలేమీ చెప్పలేదు.
ఇదిలా ఉంటే ఇదే కెవిఎన్ ప్రొడక్షన్స్ కోసం ప్రభాస్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు అంశాలను లింక్ చేసి చూస్తే లోకేష్ సినిమాలో హీరో ప్రభాసేనని అర్థమవుతుంది. కాకపోతే వీరి కాంబోలో సినిమా సెట్ అవడానికి చాలా టైమ్ పట్టనుంది. ఎంతలేదన్నా వీరి కాంబినేషన్ లో రావాలంటే మరో ఏడాదిన్నర పడుతుంది. ఈ కాంబో నిజమైతే మాత్రం లోకేష్ కు ఇంతకంటే గ్రాండ్ టాలీవుడ్ ఎంట్రీ మరొకటి ఉండదు.













