లోకేష్, పూరీని మించేట్లున్నాడుగా…
ఇప్పుడొస్తున్న డైరెక్టర్స్ ఎంత క్రియేటివ్ గా ఉన్నా కూడా కుదిరినంత త్వరగా సినిమాలను ఫినిష్ చేయడం అవసరం. అలా అయితేనే నిర్మాత పెట్టుబడికి తగినంత భద్రత ఉంటుంది. ఒకప్పుడు దాసరి, రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్లు ఒకేసారి రెండు మూడు షూటింగ్‌లు పెట్టుకున్న దగ్గర నుంచి ఏడాదికి ఒక సినిమా పూర్తి చేస్తేనే గొప్ప అనే స్టేజ్ కి వచ్చేశారు మన డైరెక్టర్లు.
ఈ కారణాల వల్లే స్టార్ హీరోలు సైతం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మాత్రం స్పెషల్‌గా నిలుస్తున్నాడు. ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఇప్పటిదాకా తీసింది అయిదే సినిమాలయినా మొదటి సినిమా తప్ప మిగిలినవన్నీ పెద్ద స్టార్ హీరోల సినిమాలే. అయినా దేనికీ 150 రోజుల కంటే ఎక్కువ వర్క్ చేసింది లేదు.
మానగరం 45 రోజులు, ఖైదీ62 నైట్స్, మాస్టర్ 129 రోజులు, విక్రమ్ 110 రోజుల్లో పూర్తి చేశాడు లోకేష్. తాజాగా లియోకి 125 రోజులకు గుమ్మడికాయ కొట్టేవాడు. కార్తీ, విజయ్, కమల్ హాసన్ లాంటి మోస్ట్ వాంటెడ్ స్టార్లతోనే లోకేష్ ఈ ఘట్టాన్ని సాధించాడు. బడ్జెట్ పెరిగినా సరే వర్కింగ్ డేస్‌ని మాత్రం తన కంట్రోల్లో ఉంచుకుంటున్న లోకేష్ ను ఈ విషయంలో మాత్రం స్పూర్తిగానే తీసుకోవాలి.
ఒకప్పుడు సినిమాలను ఇంత ఫాస్ట్ గా పూర్తి చేసేది కేవలం పూరీనే. మహేష్ బాబుతో బిజినెస్ మేన్ సినిమాను మూడు నెలల్లో కంప్లీట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిన పూరీ, ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు పూరీ తర్వాత సినిమాలను త్వరగా ఫినిష్ చేసే డైరెక్టర్లలో లోకేష్ చేరాడు. చూస్తుంటే త్వరలోనే లోకేష్ పూరీని బీట్ చేసేట్లున్నాడు.













