Lokesh Kanagaraj: నాగ్ కు ఏదీ వెంటనే నచ్చదు
సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) హీరోగా వస్తోన్న సినిమా కూలీ(Coolie). లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా కోసం తమిళ ఆడియన్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్వుడ్ ఆడియన్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం కూలీలో నాగార్జున(Nagarjuna), ఆమిర్ ఖాన్(aamir khan), ఉపేంద్ర(Upendra) లాంటి స్టార్లు నటిస్తుండటమే.
ఆల్రెడీ షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటున్న కూలీ, ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ కూలీకి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో షేర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే నాగ్ గురించి లోకేష్ ఓ విషయాన్ని వెల్లడించారు.
కూలీలో నాగార్జున సైమన్(Saimon) అనే విలన్ పాత్రలో నటిస్తుండగా, లోకేష్ ఆ పాత్రకు సంబంధించిన ఐడియా చెప్పినప్పుడు అది ఆయనకు బాగా నచ్చిందని, కానీ దాన్ని డెవలప్ చేయడం తనకు చాలా ఛాలెంజింగ్ గా మారిందని లోకేష్ తెలిపారు. అందులో భాగంగానే నాగ్ కు ఏడెనిమిది సార్లు నెరేషన్ ఇచ్చానని, నాగ్(Nag) సార్ కు ఏదీ వెంటనే నచ్చదని, ఆయన్ని ఒప్పించడం చాలా కష్టమని లోకేష్ తెలిపారు.







