Little Hearts: “లిటిల్ హార్ట్స్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్” (Little Hearts). ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. “లిటిల్ హార్ట్స్” సినిమా ఈ నెల 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యంగ్ హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” మూవీకి మిక్సింగ్ సహా మ్యూజిక్ పరంగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేశాం. ఇలాంటి ఒక మంచి మూవీకి వర్క్ చేసినందుకు హ్యాపీగా ఉంది. సక్సెస్ మీట్ లో మళ్లీ డీటెయిల్ గా మాట్లాడుతూ. అన్నారు.
డీవోపీ సూర్య బాలాజీ మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” మూవీకి వర్క్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. మా సాయి మార్తండ్ కాంప్రమైజ్ కాకుండా మూవీని రూపొందించాడు. నాకు సపోర్ట్ అందించిన ఈటీవీ విన్ కు థ్యాంక్స్. మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటి అనితా చౌదరి మాట్లాడుతూ – 90’s బయోపిక్ చూశాక మా ఇంట్లో వాళ్లు ఇలాంటి ప్రాజెక్ట్ చేయొచ్చు కదా అని అడిగేవారు. వాళ్లు అడిగినట్లే అలాంటి మూవీ చేసే అవకాశం “లిటిల్ హార్ట్స్”తో వచ్చింది. ఈ నెల 5న ఈ మూవీ రిలీజ్ కు వస్తోంది. టీచర్స్ డేతో పాటు ఓనమ్ కూడా వస్తోంది. థియేటర్స్ లో “లిటిల్ హార్ట్స్” చూస్తూ బాగా నవ్వుకుంటారు. మాది గ్యారెంటీ. అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళీ పున్న మాట్లాడుతూ – ఆదిత్య నేను మంచి ఫ్రెండ్స్. ఈ రోజు అతను ఈవెంట్ కు రాలేకపోయాడు. “లిటిల్ హార్ట్స్” చిత్రాన్ని బన్నీవాస్ గారికి చూపించినప్పుడు చాలా ఎంజాయ్ చేశారు. బన్నీవాస్, వంశీ నందిపాటి వల్లే మా మూవీ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అన్నారు.
ఈటీవీ విన్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” మూవీ ఈ నెల 5న థియేటర్స్ లోకి వస్తోంది. థియేటర్స్ కు వెళ్లి మూవీ చూడండి. బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రోజు మా ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చినందుకు శ్రీవిష్ణు గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడుతూ – మా ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ మూవీ “లిటిల్ హార్ట్స్” ఈవెంట్ శ్రీవిష్ణు గారి చేతుల మీదుగా జరగడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. ఈ నెల 5న “లిటిల్ హార్ట్స్” మార్నింగ్ షో కు వెళ్లండి. ఈవినింగ్ షో కు మీ ఫ్యామిలీని తీసుకుని వెళ్తారు. అన్నారు.
హీరోయిన్ శివానీ నాగరం మాట్లాడుతూ – మా మూవీ ఈవెంట్ కు శ్రీవిష్ణు గారు రావడం హ్యాపీగా ఉంది. ఆయన యాక్టింగ్, కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. “లిటిల్ హార్ట్స్” సినిమాకు వర్క్ చేసిన టీమ్ లోని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అందరు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మంచి మూవీ చేశారు. సింజిత్ తన మ్యూజిక్ తో మూవీకి లైఫ్ ఇచ్చారు. “లిటిల్ హార్ట్స్” సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కు ఒక ఆర్క్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ లైవ్ లీగా ఉంటూ ఆకట్టుకుంటుంది. అఖిల్ క్యారెక్టర్ తో మౌళి గుర్తుండిపోతాడు. మార్నింగ్ షో చూసిన వాళ్లు తప్పకుండా ఈవెనింగ్ షోకు తమ ఫ్యామిలీతో వెళ్తారు. “లిటిల్ హార్ట్స్” లాంటి మంచి మూవీ రూపొందించిన డైరెక్టర్ సాయి మార్తాండ్ కు థ్యాంక్స్. అలాగే వంశీ నందిపాటి గారు, బన్నీ వాస్ గారు గ్రాండ్ గా మా మూవీని రిలీజ్ చేస్తున్నారు. వాళ్లిద్దరికీ థ్యాంక్స్. అన్నారు.
హీరో మౌళి తనూజ్ మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మీ వల్లే మా మూవీ ఇంతగా ఆడియెన్స్ లోకి వెళ్తోంది. కానీ కొందరు సోషల్ మీడియాలో కావాలనే మా మూవీని నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. నెగిటివ్ కామెంట్స్ రాస్తున్నారు. మా సినిమాను బాయ్ కాట్ చేయాలని అంటున్నారు. ఎప్పుడో నేను ఎవరినో ఏదో అన్నానని, వారి మీద కామెంట్ చేశానని చెబుతూ “లిటిల్ హార్ట్స్” మూవీకి నెగిటివ్ చేస్తున్నారు. వీళ్లు మనలో ఒకరు ఎదుగుతుంటే కాళ్లు పట్టి కిందకు లాగే టైప్ మనుషులు. మీకు వార్నింగ్ ఇస్తున్నా. మిమ్మల్ని మా మూవీ ద్వారా నవ్విస్తా, మీ మనసులు గెలుచుకుంటా. మీ ఫ్యామిలీతో కలిసి మా సినిమాకు వచ్చి ఎంజాయ్ చేసేలా చేస్తాం. సో తప్పకుండా మా “లిటిల్ హార్ట్స్” సినిమా చూసేందుకు థియేటర్స్ కు రావాలని కోరుతున్నా. అన్నారు.
మిత్రమండలి మూవీ ప్రొడ్యూసర్ భాను మాట్లాడుతూ – మా మిత్రమండలి మూవీ రిలీజ్ చేయాల్సిన డేట్ ఇది. “లిటిల్ హార్ట్స్” వాళ్లు తీసుకున్నారు. “లిటిల్ హార్ట్స్”తో ఒక మంచి మూవీ చేసినట్లు ఈ పాజిటివ్ వైబ్స్ తోనే తెలుస్తోంది. ఎంటైర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీవాస్ మాట్లాడుతూ – మా భాను ఇందాక చెప్పినట్లు నా బ్యానర్ మీద ఫస్ట్ రిలీజ్ చేయాల్సిన సినిమా మిత్రమండలి. అయితే “లిటిల్ హార్ట్స్”ను ఆ డేట్ కు తీసుకొస్తున్నాం. ఈ సినిమా ఎంత నచ్చితే నేను నా బ్యానర్ నుంచి ఫస్ట్ మూవీగా తీసుకొస్తున్నానో అర్థం చేసుకోండి. “లిటిల్ హార్ట్స్” సినిమా చూడండి అంటే మీరు థియేటర్ కు వెళ్లరు అని మాకు తెలుసు. కంటెంట్ నచ్చితే తప్పకుండా చూస్తారు. “లిటిల్ హార్ట్స్” చూసిన వారికి మా మౌళి బాగా నచ్చేస్తాడు. ఒక యంగ్ టీమ్ కు ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేయిస్తే ఎలాంటి మంచి ఔట్ పుట్ వస్తుందో “లిటిల్ హార్ట్స్” ప్రీ రిలీజ్ ఈవెంట్ తో తెలుస్తోంది. ఈటీవీ విన్ నుంచి ఇటీవల క్రియేటివ్ కంటెంట్స్ వస్తున్నాయి. ఆ క్రమంలో వస్తున్న మూవీనే లిటిల్ హార్ట్స్. ఈ సినిమాకు ఏమాత్రం క్రెడిట్ వచ్చినా అది ఆదిత్య హాసన్ కు, ఈటీవీ విన్ వారికే దక్కాలి. వాళ్లు సినిమా చేసి మా దగ్గరకు తీసుకొచ్చారు. సాయి మార్తాండ్ కాంప్రమైజ్ కాకుండా తను అనుకున్నట్లు సినిమాను రూపొందించాడు. కొన్ని డైలాగ్స్ నా సూచనలు గౌరవించి రిమూవ్ చేశాడు. మనసులో అనుకున్నది ప్రేక్షకులకు చెప్పాలని ప్రయత్నించాడు డైరెక్టర్. అతనికి మంచి ప్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. నాకు అనిల్ రావిపూడి గారు, శ్రీవిష్ణు గారి కామెడీ అంటే ఇష్టం. ఆయన ఈ రోజు మా ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. “లిటిల్ హార్ట్స్” టీమ్ అందరికీ గొప్ప సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – ఈ రోజు మా మూవీ ఈవెంట్ కు వచ్చిన శ్రీ విష్ణు గారికి థ్యాంక్స్. “లిటిల్ హార్ట్స్” సినిమాకు యంగ్ ఎనర్జిటిక్ టీమ్ వర్క్ చేశారు. ఈ టీమ్ తో పనిచేయడం కూడా ఫన్ గా ఉంది. చదువుకోని వాళ్లం చాలా మంది ఈ మూవీకి వర్క్ చేశాం. మేమంతా కలిసి టీచర్స్ డే రోజున మీ ముందుకు “లిటిల్ హార్ట్స్”తో వస్తున్నాం. పొలిమేర మూవీ తర్వాత కాన్ఫిడెంట్ గా చెబుతున్నా “లిటిల్ హార్ట్స్” తో గట్టిగా సక్సెస్ కొట్టబోతున్నాం. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ – కొన్ని సినిమాల ప్రమోషనల్ కంటెంట్ చూడగానే మూవీ చూడాలని అనిపిస్తుంది. “లిటిల్ హార్ట్స్” అలాంటి క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. థియేటర్ లో “లిటిల్ హార్ట్స్” చూడాలని అనిపించింది. 90’s బయోపిక్ చూశాక ఆదిత్య హాసన్ ఒక కొత్త తరహా ప్లెజెంట్ కామెడీ క్రియేట్ చేశాడనే ఫీల్ కలిగింది. ఆయన ప్రొడ్యూసర్ గా వస్తున్న “లిటిల్ హార్ట్స్” కూడా అలాగే బాగా నవ్విస్తుందని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఈ మూవీ టీమ్ అందిరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ సినిమా పెద్ద హిట్ అయి మీ అందరికీ మంచి పేరు తీసుకురావాలి. మౌళి గురించి మన వాళ్లు చెప్పారు. అతని బ్యాక్ గ్రౌండ్ తెలిశాక వాళ్లు చెప్పింది నిజమేనని అర్థమైంది. ఈటీవీ వాళ్లు ఈ మధ్య సరికొత్త కంటెంట్ అందిస్తున్నారు. మేము గతంలో ఏదైనా సినిమా చేస్తే రిలీజ్ కోసం సురేష్ బాబు, దిల్ రాజు గారి దగ్గరకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు బన్నీ వాస్ గారు చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడకుండా కంటెంట్ బాగుంటే రిలీజ్ చేస్తున్నారు, ఆ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలూ మీరు రిలీజ్ చేయాలని కోరుతున్నా. ఇలాంటి కొత్త టీమ్ నుంచే ఎవరైనా పాపులర్ కావొచ్చు. మీమర్స్ వల్లే మన స్ట్రెస్ రిలీఫ్ అవుతుంటుంది. అలాంటి మీ మధ్య నుంచి వచ్చిన డైరెక్టర్ సాయి మార్తాండ్ కు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. ఈ నెల 5న థియేటర్స్ కు వచ్చి “లిటిల్ హార్ట్స్” సినిమాను బిగ్ హార్ట్ మూవీ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.