Little Hearts: “లిటిల్ హార్ట్స్” మూవీ సాధించిన విజయం ఎంతోమంది కొత్త వాళ్లకు స్ఫూర్తినిస్తోంది – విజయ్ దేవరకొండ

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” (Little Hearts) సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. ఈరోజు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా “లిటిల్ హార్ట్స్” సినిమా సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరీ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్, బండ్ల గణేష్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
నటి అనిత చౌదరి మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా మేకర్స్ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా సక్సెస్ రీసౌండ్ లా వినిపిస్తోది. ఇలాంటి విజయాన్ని గురించి నేను విని దాదాపు పదేళ్లవుతోంది. “లిటిల్ హార్ట్స్” సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అన్నారు.
నటి సత్య కృష్ణన్ మాట్లాడుతూ – ఈ సినిమా విజయం గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ సాయి మార్తాండ్ కు థ్యాంక్స్. కాత్యాయని భోంచేశావా అనే డైలాగ్ ప్రతి చోటా వినిపిస్తోంది. “లిటిల్ హార్ట్స్” చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. అన్నారు.
నటుడు జయకృష్ణ మాట్లాడుతూ – ఈ రోజు మా “లిటిల్ హార్ట్స్” మూవీ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ అన్నకు థ్యాంక్స్. అన్న మొన్న మమ్మల్ని పిలిచినప్పుడు నాకు రౌడీ వేర్ నుంచి ఐదు మంచి టీ షర్ట్స్ ఇప్పించాడు. చాలా బాగున్నాయి. ఈ సినిమా సక్సెస్ అయ్యింది కాబట్టి నేను సినిమాలే చేస్తా, సోషల్ మీడియా వదిలేస్తా అని కొందరు అంటున్నారు. కానీ నేను వచ్చిందే సోషల్ మీడియా బ్యాక్ గ్రౌండ్ నుంచి కాబట్టి ఆ మీడియాని వదిలివెళ్లను. అన్నారు.
నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ – ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధించడానికి బన్నీ వాస్ గారు, వంశీ నందిపాటి గారు ఈ మూవీని జనాల్లోకి తీసుకెళ్లిన విధానమే కారణం. నేను ఈ సినిమాలో నటించేప్పుడు కంట్రోల్ చేసి సెటిల్డ్ గా పర్ ఫార్మ్ చేయించాడు డైరెక్టర్ సాయి మార్తాండ్. అందుకే ఈ రోజు నేను చేసిన గోపాల్ రావు క్యారెక్టర్ అంతమంచి పేరు వస్తోంది. “లిటిల్ హార్ట్స్” ఇచ్చిన గుర్తింపుతో మరో ఆరేడు సినిమాల అవకాశాలు వచ్చాయి. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ – 2019లో డియర్ కామ్రేడ్ సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటించే అవకాశం వచ్చింది. అప్పుడే విజయ్ అన్నతో పరిచయం. లాస్ట్ వీక్ విజయ్ అన్న ఇంటికి పిలిచి “లిటిల్ హార్ట్స్” సక్సెస్ అయినందుకు అప్రిషియేట్ చేశారు. లైఫ్ అంతా ఒక సర్కిల్ లా అనిపించింది. అలాగే నా అభిమాన హీరో మహేశ్ బాబు గారు మా మూవీ గురించి ట్వీట్ చేశారు. ఈ మూవీ సక్సెస్ తో ఒక్క ఫ్రైడే మా అందరి జీవితాలను మార్చేసింది. అన్నారు.
డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ – ఈ సక్సెస్ మీట్ లో మా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ ను మిస్ అవుతున్నా. నీకు నచ్చినట్లు సినిమా చేయి అని కావాల్సిన ఫ్రీడమ్ ఇచ్చారు ఆదిత్య. నా టీమ్ ఇచ్చిన సపోర్ట్ తోనే 32 రోజుల్లో ఈ సినిమా కంప్లీట్ చేయగలిగాను. ఒక్క ఫ్రైడే మా లైఫ్ ను మార్చేసింది. విజయ్ అన్న ఇంటికి పిలిచి మూడు గంటలు మాట్లాడారు. మహేశ్ బాబు, నాని, నాగ చైతన్య ట్వీట్ చేశారు. నా ఫేవరేట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఫోన్ చేసి మాట్లాడారు. విజయ్ అన్నతో తరుణ్ భాస్కర్ రూపొందించిన పెళ్లి చూపులు మూవీ నా ఫేవరేట్ ఫిలిం. బన్నీ వాస్ గారితో తప్పకుండా మూవీ చేస్తా. అన్నారు.
హీరోయిన్ శివానీ నాగరం మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమా మేము ఊహించినంత పెద్ద విజయాన్ని అందించింది. నా కాత్యాయని క్యారెక్టర్ ను ప్రేక్షకులు బాగా లవ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వాళ్లు పంపిస్తున్న ప్రశంసలు చూస్తుంటే హ్యాపీగా ఉంది. తెలుగు ప్రేక్షకులు తెలుగు హీరోయిన్స్ ను ఆదరించరు అనేది తప్పు అని ప్రూవ్ అయ్యింది. మా సినిమాకు చాలా మంది కొత్తవాళ్లు వర్క్ చేసినా ఎక్సిపీరియన్స్ ఉన్న టీమ్ వర్క్ చేసినట్లే ఉందనే అప్రిషియేషన్స్ వస్తున్నాయి. ఈ సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
హీరో మౌళి తనూజ్ మాట్లాడుతూ – నా కెరీర్ లో ఏం జరగాలని కోరుకున్నానో అవన్నీ గత కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. నా ఫేవరేట్ స్టార్స్ అందరూ ట్వీట్స్ చేస్తున్నారు, ఫోన్స్ చేస్తున్నారు. పిలిపించుకుని మాట్లాడుతున్నారు. విజయ్ అన్న ఇంటికి పిలిచి మాట్లాడారు, రౌడీ వేర్ దుస్తులు ఇచ్చారు. అల్లు అర్జున్ గారు, మహేశ్ గారు ట్వీట్స్ చేశారు. రవితేజ గారు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ మధ్య ఫోన్ వస్తే ఏ సెలబ్రిటీ ఫోన్ చేస్తున్నారు అని చూసుకుంటున్నా. నీ సక్సెస్ మా సక్సెస్ అంటూ సోషల్ మీడియా ద్వారా చాలామంది పోస్ట్ లు చేస్తున్నారు. అవన్నీ చూస్తుంటే చాలా ఎమోషనల్ ఫీలింగ్ కలుగుతోంది. మా పేరెంట్స్ ను వెకేషన్ తీసుకెళ్లాలనేది నా కోరిక. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది కాబట్టి యూఎస్ టూర్ ఫిక్స్ అయ్యింది. అన్నారు.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ – నేను చాలా రోజుల తర్వాత థియేటర్ లో చూసిన సినిమా “లిటిల్ హార్ట్స్”. సినిమా అంటే ఇలా ఉండాలి అనిపించింది. ఇది సినిమా కాదు మన లైఫ్. నేనూ ఈ మూవీలో మౌళిలాగే మా నాన్నకు అబద్ధాలు చెబుతూ కాలేజ్ కు వెళ్లానని సినిమాలకు వెళ్లేవాడిని. రెండున్నర కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయ్యింది. ఒక స్టార్ హీరో సినిమా మూడు రోజుల షూటింగ్ ఖర్చు ఇది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా చచ్చిపోయిందనే అంతా అన్నారు. కానీ కథ బాగుంటే చిన్న చిత్రాలనూ థియేటర్స్ లో ప్రేక్షకులు చూస్తారని “లిటిల్ హార్ట్స్” ప్రూవ్ చేసింది. ఈ సినిమా సక్సెస్ ఇండస్ట్రీలో మా లాంటి వాళ్లకు గుణపాఠం కావాలి. మట్టిలో మాణిక్యాలు వెలికి తీసే ఈటీవీ సంస్థకు, ఈ సినిమాను ఇంత బాగా జనాల్లోకి తీసుకెళ్లిన బన్నీ వాస్, వంశీ నందిపాటికి నా అభినందనలు. నటుడిగా మౌళి తనకు తగిన మూవీస్ చేస్తూ కెరీర్ కొనసాగించమని సలహా ఇస్తున్నా. అన్నారు.
నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమా సక్సెస్ ను అభినందించడానికి వచ్చిన విజయ్ అన్నకు థ్యాంక్స్. బన్నీవాస్, వంశీ నందిపాటికి సక్సెస్ వస్తే నాకు దక్కినట్లే. “లిటిల్ హార్ట్స్” టీమ్ అందరికీ నా కంగ్రాట్స్ చెబుతున్నా. అరవింద్ గారే మా అందరికీ ఇన్సిపిరేషన్. ఆయన ఈ వయసులో కూడా మా కంటే ఎక్కువగా సినిమాల గురించి ఆలోచిస్తారు, కష్టపడతారు. అన్నారు.
నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ – అరవింద్ గారు ఒక సినిమా కోసం ఎంత కష్టపడతారో నేను తండేల్ మూవీ టైమ్ లో చూశాను. 76 ఏళ్ల వయసులో కూడా ఆయన సినిమా కోసం మా కంటే ఎక్కువ కష్టపడతారు. మా మూవీ సక్సెస్ సెలబ్రేషన్ లో విజయ్ అన్న గెస్ట్ గా పాల్గొనడం సంతోషంగా ఉంది. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ అంతా మా విజయ్ అనే పిలుస్తారు. అన్నారు.
నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ – అరవింద్ గారి వల్లే నేను ఎస్ కేఎన్ వంశీ నందిపాటి ధీరజ్ మొగిలినేని వంటి యంగ్ ప్రొడ్యూసర్స్ ఈ వేదిక మీద ఉన్నాం. ఆయన మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. అరవింద్ గారితో వర్క్ లో మేము పోటీ పడలేం. ఈ సినిమాకు ఆయన లేకపోవడం వల్ల మాకు పని తగ్గింది. ఆయన నిద్రపోరు నిద్రపోనివ్వరు. సినిమా మీద అంత ప్యాషన్ తో అరవింద్ గారు ఉంటారు. విజయ్ అంటే నాకు, అరవింద్ గారికి చాలా ఇష్టం. గీతా ఆర్ట్స్ లో విజయ్ తో త్వరలో సినిమా చేస్తాం. గీత గోవిందం కంటే పెద్ద హిట్ చేయబోతున్నాం. మేము చేయబోయే సినిమా విజయ్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. లిటిల్ హార్ట్స్ మూవీకి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి సంతోషంగా ఖర్చు పెట్టాం. మా ఇంట్లో పిల్లలకు ఖర్చు పెట్టినంత ఆనందంగా ఖర్చు పెట్టా. ఈ సినిమా విషయంలో మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ – లిటిల్ హార్ట్స్ లాంటి చిన్న సినిమా టీమ్ ను సపోర్ట్ చేసేందుకు విజయ్ రావడం హ్యాపీగా ఉంది. ఒక యంగ్ టీమ్ తో సినిమా చేస్తే ఎంత సందడిగా ఉంటుందో మీ అందరినీ చూస్తుంటే తెలుస్తోంది. ఇలాంటి టీమ్ తో ఒక సినిమా నిర్మించాలని అనిపిస్తోంది. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ సినిమా గురించి నాకు చెప్పారు. మా సంస్థ ద్వారా రిలీజ్ చేశాం. ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. అన్నారు.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – మా బ్రదర్ ఆనంద్ ద్వారా నాకు లిటిల్ హార్ట్స్ మూవీ గురించి చాలా రోజులుగా తెలుసు. ఆనంద్ ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ తో మూవీ చేస్తున్నాడు. సినిమా టీజర్, ట్రైలర్ పంపిస్తుండేవాడు. ఈ టీమ్ లోని వారిని నేనెప్పుడూ కలవలేదు కానీ వాళ్లతో నాకు ఏదో అనుబంధం ఉంది అనిపించేది. మౌళి అండ్ టీమ్ మా ఇంటికి వచ్చి మీట్ అయినప్పుడు సక్సెస్ మీట్ కు రావాలని అడిగారు. నేను కాదనలేకపోయా. వీళ్లంతా ఔట్ సైడర్స్. ఏ సపోర్ట్ లేకుండా సక్సెస్ అందుకున్న వీళ్లు మరెంతో మంది కొత్త వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఒకరు సక్సెస్ అయితే అది ఎంతోమందికి మంచి చేస్తుంది. మనమూ సక్సెస్ అందుకోవచ్చనే ఒక ఫైర్ న్యూ టాలెంట్ లో కలుగుతుంది. అందుకే వీళ్లకు సపోర్ట్ చేయాలని అనిపించింది.
అరవింద్ గారు సక్సెస్ కావడం వల్ల ఆయన దగ్గర బన్నీ వాస్, వంశీ, ధీరజ్, ఎస్ కేఎన్..ఇలా ఎంతోమంది యంగ్ ప్రొడ్యూసర్స్ ఆ కాంపౌండ్ నుంచి రాగలిగారు. ఈ యంగ్ టీమ్ కు నా కంగ్రాట్స్ చెబుతున్నా. నేను ఏ మూవీ టీమ్ ను కలిసినా కాసేపే మాట్లాడతాను. కానీ లిటిల్ హార్ట్స్ టీమ్ తో మూడు గంటలు మాట్లాడాను. డైరెక్టర్ సాయి మార్తాండ్ ఒక చిన్న కథను బ్యూటిఫుల్ గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. పర్పెక్ట్ కాస్టింగ్ చేశాడు. కాత్యాయని క్యారెక్టర్ లో శివానీ బాగా నటించింది. మౌళి రీల్స్ ను ఆనంద్ నాకు చూపించేవాడు. ఇతన్ని సినిమాల్లోకి తీసుకురావాలి అనేవాడు. ఈ సినిమాను మౌళి ఎంటర్ టైనింగ్ గా ప్రమోట్ చేసుకున్నాడు. అతని ప్రమోషన్స్ కోసం మౌళి చేసే నెక్ట్స్ సినిమా కోసం ఎదురుచూస్తుంటా. నాకు మా పేరెంట్స్ ఫస్ట్, సినిమా నెక్ట్స్. మౌళి నీలాగే నువ్వు ఉండు. పేరెంట్స్ హ్యాపీగా ఉండేలా చూసుకో. ఈ టీమ్ మరిన్ని మంచి సక్సెస్ ఫుల్ మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.