సోషల్ మీడియా ట్రోల్స్ ని అంగీకరించని లైగర్ భామ
పూరి జగన్నాద్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘లైగర్’. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ ‘అనన్య పాండే’. తన పాత్ర పరంగా, అందచందాలతో మెప్పించినా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాని తర్వాత ఆమెకి ఆఫర్లు కూడా తక్కువగానే వచ్చాయని చెప్పాలి. టాలీవుడ్లో తన మొదటి సినిమాతోనే డిజాస్టర్ లిస్ట్ లోకి చేరినప్పటికీ, ఈ భామ.. స్టార్ కిడ్ అవ్వడంతో కొన్ని ఆఫర్లు వచ్చాయి. రీసెంట్ గా హిందీలో తను నటించిన డ్రీమ్ గర్ల్ 2 మూవీ రిలీజ్ కు దగ్గరపడటంతో ఆ సినిమాను తెగ ప్రమోట్ చేస్తుంది అనన్య పాండే. ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి ఈ విధంగా చెప్పుకొచ్చింది.
‘నేను చేసిన పని అలా కాకుండా వేరేలా చేయొచ్చు కదా అంటే స్వీకరిస్తాను. అలానే నువ్వు అది ఎందుకు చేయడం లేదు అంటే దానినీ తీసుకోగలను. అంతే కానీ కొంతమంది ట్రోలర్స్ పదే పదే కావాలని నన్ను ట్రోల్స్ లోకి లాగుతున్నారు. ఏదైనా కొంత పరిమితి వరకే భరించగలను. ఆ ట్రోల్స్ వల్ల నాకు చాలా సార్లు బాధ అనిపించింది. ఇలాంటివి విని నేను కన్నీళ్లు పెట్టుకొన్నాను కానీ నా భవిష్యత్తు గురించి అలోచించి ధైర్యంతో ముందుకు సాగుతున్నాను’ అని చెప్పుకొచ్చింది.













