డబుల్ ఇస్మార్ట్ కోసం లైగర్ బయ్యర్ల ఎదురుచూపులు
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు ఆడియన్స్ లో అంచనాలను పెంచుతున్నాయి.
ఇదిలా ఉంటే లైగర్ తర్వాత ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న పూరీ, పలు హీరోలతో సినిమాలు చేయడానికి ట్రై చేసి ఆఖరికి డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ ఆడియో రైట్స్ ఇప్పటికే అమ్ముడుపోయాయి. కానీ నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో మాత్రం పూరీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లంతా పూరీకి సహకరించాలని ఉన్నప్పటికీ, ఈ సినిమాకు ఛార్మీ నిర్మాణ భాగస్వామిగా ఉండటం వారికి నచ్చడం లేదట.
అందుకే డబుల్ ఇస్మార్ట్ పూర్తి నిర్మాణ బాధ్యతలను పూరీనే చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే లైగర్ సినిమాతో నష్టపోయిన బయ్యర్లకు తమ పాత బకాయిలను సెటిల్ చేస్తారేమో అన్న ఆశతో వారు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారట. ముందు చెప్పినట్లు అయితే సినిమా మార్చి 8న రిలీజ్ కావాలి. కానీ కొంతమంది ఈ సినిమా వాయిదా పడుతుందంటున్నారు. ఏదేమైనా సినిమా వాయిదా విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు నమ్మడానికి లేదు.













