విజయనిర్మలకు జీవన సాఫల్య పురస్కారం
ప్రముఖ సినీనటి, మహిళా దర్శకురాలు విజయనిర్మలకు ప్రకటించిన జీవన సాఫల్య పురస్కారాన్ని ఆమె కుమారుడు నటుడు నరేష్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ, జె-వరల్డ్, వీ టీం మేనేజ్మెంట్ సంస్థలు సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐడబ్ల్యుడిఎ అవార్డులను వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళలకు అందించాయి. విశాఖ గురజాడ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, నటి సన తదితరుల చేతుల మీదుగా ఈ అవార్డును నరేష్‌కు అందజేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ నటి విజయనిర్మల తొలి మహిళా డైరెక్టర్ అని, గిన్నిస్ బుక్ రికార్డు సాధించారని పేర్కొన్నారు.













