గాయం2నే ఇప్పుడు లియోగా వస్తుందా?
రామ్ గోపాల్ వర్మ, జగపతి బాబు కాంబోలో వచ్చిన గ్యాంగ్ స్టర్ డ్రామాగా గాయం సినిమాకు స్పెషల్ ప్లేస్ ఉంది. మణిరత్నం స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా అప్పట్లో సంచలనాలు సృష్టించింది. తర్వాత దీనికి సీక్వెల్గా గాయం2 సినిమా వచ్చింది. ఆ సినిమాకు ప్రవీణ్ శ్రీ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన గాయం2కు అనుకున్న విజయం దక్కలేదు. అలాంటి ఈ సినిమా కథనే లోకేష్, కొంచెం అటూ ఇటూ మార్చి లియో గా మార్చాడని ఇప్పుడు నెట్టింట వినిపిస్తున్న మాట.
గాయం2 సినిమా ను హాలీవుడ్ మూవీ ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్ నుంచి స్పూర్తి పొంది రాసుకున్నారు. భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉన్న హీరో దాన్ని వదిలేసి వేరే దేశంలో రెస్టారెంట్ పెట్టుకుని గొడవలకు దూరంగా ఉండటం, ఎంతో కాలంగా వెతుకుతున్న శత్రువులకు హీరో జాడ తెలిశాక ఫ్యామిలీని టార్గెట్ చేయడం, దీంతో తనలోని ఒరిజినల్ క్యారెక్టర్ ను బయటకు తీసి అందరినీ చంపేసి గతంలో ఉన్నట్లు మారడం ఇది గాయం2 స్టోరీ.
లియో ట్రైలర్ చూస్తే ఆ కథ కూడా ఇదే అని తెలుస్తోంది. విజయ్ ఎక్కడో కొండ ప్రాంతంలో హోటల్ పెట్టుకుని ఉండటం, భయపడుతూ లైఫ్ ను ముందుకు తీసుకెళ్లడం, శత్రువులు వచ్చి ఎటాక్ చేస్తే తప్పించుకోడం, చివరకు తిరగబడం సేమ్ గాయం2 లానే ఉంది. నిజంగానే లోకేష్ గాయం2ను అటూ ఇటూ మార్చి లియోగా మలిచాడా లేక ఇంకేమైనా స్పెషల్ ఎట్రాక్షన్స్ ఇందులో జోడించాడా అనేది తెలియాలంటే అక్టోబర్ 19 వరకు ఆగాల్సిందే.













