బాలీవుడ్ మూవీ ఆధారంగా లియో మూవీ
దసరా సందర్భంగా భగవంత్ కేసరితో పాటూ లియో సినిమా కూడా అక్టోబర్ 19న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా అయినప్పటికీ హీరో విజయ్ కావడం, దాని దర్శకుడు లోకేష్ కనగరాజ్ కావడంత మిగిలిన భాషల్లో కూడా మంచి హైప్ ఏర్పడింది. ఓవర్సీస్ బయ్యర్లు ఈ సినిమాకు ఏకంగా 40 రోజుల ముందే యూకేలో అడ్వాన్డ్స్ బుకింగ్స్ మొదలుపెట్టడం, దానికి మంచి రెస్పాన్స్ రావడం సినిమాకు మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
ఇక అసలు విషయానికి వస్తే, లియో కథను 2005లో వచ్చిన ఓ హాలీవుడ్ మూవీని స్పూర్తిగా తీసుకుని రాసుకున్నట్లు చెన్నై ఫిల్మ్ వర్గాలు చెప్తున్నాయి. ఏ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్ సినిమా స్టోరీని ఆధారంగా తీసుకుని ఈ స్టోరీని లోకేష్ డెవలప్ చేసినట్లు తెలుస్తోంది. టీజర్ చూస్తుంటే ఈ వార్తల్లో నిజముందనే అనిపిస్తుంది.
హిస్టరీ ఆఫ్ వయొలెన్స్ మూవీ అప్పట్లో మంచి హిట్ అయింది. ఇంటెన్స్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే లోకేష్ ఆ కథను ఎలాంటి ఎలివేషన్లతో రూపొందించాడన్నది చూడాలి. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వెయ్యి కోట్లను కలెక్ట్ చేస్తుందని ఫ్యాన్స్ ఊహల్లో తేలుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ లియో సినిమాను తెలుగులో భారీ లెవెల్లో రిలీజ్ చేస్తుంది.













