Lenin: లెనిన్ నెక్ట్స్ షెడ్యూల్ అప్డేట్

అక్కినేని యంగ్ హీరో అఖిల్(Akhil) కు ఎన్ని సినిమాలు చేసినా బ్లాక్ బస్టర్ మాత్రం అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. ఎంతో కష్టపడి, ఎన్నో ఆశలతో సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఏజెంట్(Agent) సినిమా చేస్తే ఆ సినిమా టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో కొంత గ్యాప్ తీసుకుని తన తర్వాతి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మురళీ కిషోర్ అబ్బూరి(Murali Kishore Abburi) దర్శకత్వంలో లైన్ లో పెట్టాడు.
ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమాకు లెనిన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు. శ్రీలీల(Sree Leela) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తోంది. లెనిన్(lenin) చిత్ర యూనిట్ నెక్ట్స్ షెడ్యూల్ కోసం తిరుపతికి వెళ్లనున్నట్టు సమాచారం. సినిమా షూటింగ్ మొత్తంలో ఇది చాలా కీలక షెడ్యూల్ అని, ఇప్పటికే మేకర్స్ దీని కోసం తిరుపతిలోని పలు లోకేషన్స్ ను షూటింగ్ కోసం వెతికి లాక్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చిత్తూరు నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అఖిల్ భాష కంప్లీట్ చిత్తూరు యాసలోనే ఉంటుందని తెలుస్తోంది. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి నవంబర్ 14కు సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో అఖిల్- శ్రీలీల మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయని చెప్తున్నారు. కాగా లెనిన్ పై అఖిల్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు.