Lenin: అఖిల్ లెనిన్ షూటింగ్ పై క్రేజీ అప్డేట్

అక్కినేని అఖిల్(Akkineni Akhil) కు ఏం చేసినా కలిసిరావడం లేదు. హీరోగా పరిచయమైనప్పటి నుంచి ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సాలిడ్ హిట్ ఒక్కటీ అఖిల్ ఖాతాలో లేదు. ఎన్నో ఆశలతో ఒళ్లు హూనం చేసుకుని మరీ ఏజెంట్(Agent) సినిమా చేస్తే ఆ సినిమా టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది. దీంతో అఖిల్ ఏజెంట్ తర్వాత బాగా టైమ్ తీసుకుని నెక్ట్స్ ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు.
మురళీ కిషోర్ అబ్బూరి(Murali Kishore Abburi) దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఓ విలేజ్ లవ్ స్టోరీని చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాకు లెనిన్(Lenin) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడో అప్డేట్ వినిపిస్తోంది. లెనిన్ లో అఖిల్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం స్పెషల్ గా తిరుమల ఏరియాలో ఓ భారీ సెట్ వేస్తున్నారట. తిరుమల కొండ నేపథ్యంలో ఈ సీక్వెన్స్ ఉండనున్నట్టు సమాచారం.
చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న లెనిన్ కోసం అఖిల్ చాలానే కష్టపడుతున్నాడు. ఈ మూవీలో అఖిల్ చిత్తూరు యాసలోనే మాట్లాడబోతున్నాడట. లెనిన్ లో అఖిల్ సరసన శ్రీలీల(Sree Leela) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను దసరా బరిలో నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.