‘లెహరాయి’ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను – హీరో కార్తికేయ
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లెహరాయి.డిసెంబర్ 9న లెహరాయి సినిమా విడుదలకానుంది. ఇందులో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది ఈ చిత్ర బృందం.
హీరో కార్తికేయ మాట్లాడుతూ…
అందరికి నమస్కారం, ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి మూవీ ను సపోర్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. కొత్త సినిమా హిట్ ఎంత హిట్ అయితే అంతమంది కొత్తవాళ్లు వస్తారు. ఎంతమంది కొత్తవాళ్లు వస్తే ఇండిస్ట్రీ అంత బాగుంటుంది.సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలిపారు. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
హీరో రంజిత్ మాట్లాడుతూ…
వేణుగోపాల్ గారికి చాలా థాంక్యూ. ఈ సినిమాకు ఫస్ట్ ఆడియన్ ఆయనే. ఈ రోజు నాకు 100 కోట్లు లాటరీ గెలిచినంత ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి కథ, ఇది పూరి జగన్నాధ్ తీసిన, త్రివిక్రమ్ తీసిన అందరికి నచ్చుతుంది. అంత అద్భుతమైన కథ ఇది. ఈ సినిమా స్టార్ట్ ఐనప్పటినుండి మంచి పాజిటివ్ వైబ్ ఉంది. మా మూవీ ప్రోమోట్ చెయ్యడానికి వచ్చిన కార్తికేయ గారికి చాలా థాంక్యూ. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది.డిసెంబర్ 9న థియేటర్ కి వచ్చి సినిమా చూస్తారని ఆశిస్తున్నా.
దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ…
ముందుగా మీడియాకు కృతజ్ఞతలు.ఇక్కడికి వచ్చిన అతిధులు అందరికి కృతజ్ఞతలు.ఈ రోజు హీరో మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ గారు ఈ సినిమాలో ఆరు పాటలు మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమాకి హీరో మద్దిరెడ్డి శ్రీనివాస్ గారు, ఆయనే మా దేవుడు మద్దిరెడ్డి శ్రీనివాస్ గారు మాకంటే ఎక్కువగా సినిమాపై మంచి ఇంట్రస్ట్ చూపించారు అంటూ, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు. డిశంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ…
ఇక్కడికి వచ్చిన మీడియాకు కృతజ్ఞతలు. ఈ సినిమాను నా మిత్రుడు కుమారస్వామి ప్రారంభించారు. ఇదివరకు ఆయన తీసిన సినిమాలకు నేను భాగస్వామిగా ఉన్నాను. కరోనా మహమ్మరి కారణంగా ఆయన చనిపోయాక ఈ సినిమాను పట్టుబట్టి ఈ స్థాయికి తీసుకొచ్చాను. ఈ సినిమాను కథాపరంగా, పాటల పరంగా మా టీం అంతా ఎంతో కష్టపడ్డారు.
సినిమాకు కావాల్సిన అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 9న రిలీజ్ చేస్తున్నాం.ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ సినిమాను చాలా మందికి చూపించాను. అందరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఈ సినిమాకు పి.ఆర్.ఓ ఏలూరు శ్రీను మంచి సపోర్ట్ చేసారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కృతజ్ఞతలు.













