Akhanda2: అఖండ2లో ఆ హీరోయిన్ కూతురు
కొన్ని సినిమాల క్యాస్టింగ్ సెలెక్షన్ల వెనుక ఎంతో ఆశ్చర్యమైన బ్యాక్ స్టోరీలుంటాయి. బాలకృష్ణ(Balakrisha)తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఫినిష్ చేసి నాలుగో సినిమాగా బోయపాటి శ్రీను(Boyapati Srinu) అఖండ2(Akhanda2)ను చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దానికి సంబంధించిన షూటింగ్ మొదలైంది. సెప్టెంబర్ 25న అఖండ2 శివ తాండవం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
స్కంద(Skanda) డిజాస్టర్ నుంచి గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలనే ఆలోచనతో బోయపాటి ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్త పడుతూ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అఖండ2లో చిన్న బాలయ్య(Balayya) కూతురి పాత్ర కోసం హీరోయిన్ లయ(Laya) కూతురు శ్లోక(Sloka) ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకోవాలి.
బాలయ్య- లయ కాంబోలో వచ్చిన విజయేంద్ర వర్మ(vijayendra varma) సినిమాలో చిన్న పాపగా బలగం(balagam) హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్(kavya kalyanram) నటించింది. ఇప్పుడు లయ తన కూతురిని బాలయ్య సినిమాలో నటింపచేయడం కాకతాళీయమే అయినప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. అఖండ2 కథ బాగా నచ్చడం వల్లే లయ దానికి ఓకే అన్నట్లు సమాచారం. అఖండ క్లైమాక్స్ లో నీకు ఆపదొచ్చినప్పుడు నేను తిరిగి వస్తానని అఘోరా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. నిజంగా అలా జరిగితే ఏంటనే పాయింట్ తోనే బోయపాటి శీను సీక్వెల్ రాసుకున్నట్లు తెలుస్తోంది. అఖండ2లో దాదాపుగా అఘోరా పాత్రదే డామినేషన్ ఉంటుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.













