లక్ష్మిబాంబ్ ఫస్ట్‌లుక్ విడుదల
బాలీవుడ్లో నవ్యత, వైవిధ్యతకు అక్షయ్‌కుమార్ సినిమాలు చిరునామాగా నిలుస్తుంటాయి. తాజా చిత్రం లక్ష్మిబాంబ్ లో ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించబోతున్నారు అక్షయ్ కుమార్. సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫస్ట్‌లుక్‌లో నుదుట పెద్ద తిలకం, ముక్కుపుడకతో ఎరుపురంగు చీర ధరించి మహిళా వేషధారణలో వినూత్నంగా కనిపిస్తున్నారాయన. లక్ష్మి అనే పాత్రలో నటిస్తున్నాను. కంఫర్ట్‌జోన్ నుంచి బయట పడినప్పుడే అసలైన జీవితం ప్రారంభమవుతుంది అంటూ అక్షయ్‌కుమార్ పేర్కొన్నారు. తమిళ చిత్రం కాంచన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు.













