వారితో సినిమాలు చేస్తానంటున్న లారెన్స్
కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లారెన్స్, తర్వాత నటుడిగా, డైరెక్టర్ గా మంచి మార్కులు వేయించుకున్నాడు. లారెన్స్ కూడా హీరోనా అన్న వారికి తన నటనతో సమాధానం చెప్పాడు. డైరెక్టర్ గా కూడా తన మార్క్ ఏంటో చూపించి స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇన్ని టాలెంట్స్ ఉన్న లారెన్స్ ప్రస్తుతం వాటన్నింటినీ పక్కకు పెట్టి నటనపై దృష్టి పెట్టాడు.
రీసెంట్గా పి. వాసు దర్శకత్వంలో చంద్రముఖి2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లారెన్స్, ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఇప్పుడు జిగర్తండ బడుల్ ఎక్స్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు. ఈ సినిమాను తెలుగులో పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి పూనుకున్న లారెన్స్ ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా లారెన్స్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన దర్శకత్వంలో ఫ్యూచర్లో మళ్లీ సినిమాలొస్తాయని, చిరంజీవి, రజినీకాంత్, నాగార్జునలతో సినిమాలు చేస్తానని చెప్పిన లారెన్స్, వారికి తగ్గ కథలను తాను ఇప్పటికే రెడీ చేసినట్లు కూడా తెలిపాడు. గతంలో సదరు హీరోలు కూడా లారెన్స్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. మరి లారెన్స్ ఈ స్టార్ హీరోలతో ఎప్పుడు సినిమాలు చేస్తాడో చూడాలి.













