మంచి టైటిల్‌ను పట్టేసిన లారెన్స్
తమిళ స్టార్ లారెన్స్(Lawrence) హీరోగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తూ వస్తున్నాడు. గత కొన్నేళ్లుగా కాంచన(Kanchana) సిరీస్‌తో మెప్పించిన లారెన్స్ ప్రస్తుతం తెలుగు, తమిళ్ బైలింగ్యువల్ మూవీ చేస్తున్నాడు. రమేష్ వర్మ(ramesh Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు కాలభైరవ(Kala Bhairava) అనే టైటిల్ ను లాక్ చేసినట్లు సమాచారం.
మగధీర(magadheera) సినిమాలో రామ్ చరణ్(ram Charan) పాత్ర పేరు కాలభైరవనే. రీసెంట్ గా కల్కి(kalki) సినిమాలో ప్రభాస్(Prabhas) పేరు కూడా భైరవే. ఈ రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఇప్పుడు లారెన్స్ ఏకంగా కాల భైరవ అనే టైటిల్ తో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. మొదట్లో లారెన్స్, రమేష్ వర్మతో చేస్తున్నది కిల్(Kill) రీమేక్ అనుకున్నారు కానీ ఇప్పుడది కాదని సమాచారం.
ఈ సినిమాతో పాటూ హిందీ కిల్ మూవీ రీమేక్ బాధ్యత కూడా రమేష్ వర్మ మీదే ఉంది. ప్రస్తుతం లారెన్స్ తో కాలభైరవను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు రమేష్ వర్మ. లారెన్స్ తెలుగులో స్ట్రయిట్ గా చేస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమాతో లారెన్స్- రమేష్ వర్మ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.













