మెగా ఫ్యామిలీ కండిషన్స్‌పై లావణ్య ఆన్సర్
పెళ్లి ముందు వరకు ఎలా ఉన్నా, ఎలాంటి సినిమాలు చేసినా పెళ్లి తర్వాత మాత్రం చాలా మంది హీరోయిన్లు ట్రెడిషనల్ పాత్రలకే పరిమితమవుతారు. కొంతమందైతే అసలు యాక్టింగ్ కు పూర్తిగా దూరమవుతారు. సెలబ్రిటీ ఫ్యామిలీకు కోడళ్లుగా వెళ్లిన వాళ్లు కూడా నటనకు దూరమైన వారు చాలా మందే ఉన్నారు. వారిలో అమల, ఊహ, నమ్రత లాంటి వాళ్లున్నారు.
మరి మెగా ఫ్యామిలీలోకి కోడలిగా అడుగు పెట్టిన లావణ్య త్రిపాఠికి విషయమేంటని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అందరిలా లావణ్య పెళ్లి తర్వాత యాక్టింగ్ కు దూరం కాలేదు. లావణ్య కీలక పాత్రలో మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ రాబోతంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ఎలాంటి క్యారెక్టర్లు చేయాలనే విషయంలో మెగా ఫ్యామిలీ మీకేమైనా కండిషన్స్ పెట్టారా అనే ప్రశ్న లావణ్యకు ఎదురైంది.
దానికి లావణ్య, పెళ్లికి ముందు కూడా తనకు ఎవరూ కండిషన్స్ పెట్టలేదని, తన లిమిట్స్ లో నచ్చిన పాత్రలు చేస్తూ వచ్చానని చెప్పిన లావణ్య, పెళ్లి తర్వాత కూడా వరుణ్ ఫ్యామిలీ నుంచి తనకు ఎలాంటి కండిషన్స్ లేవని తెలిపింది. అయితే మెగా ఫ్యామిలీ కోడలిగా తన పరిమితులేంటో తనకు బాగా తెలుసని కూడా లావణ్య క్లారిటీ ఇచ్చింది.













