మూడో గది మొదలైంది
ఓంకార్ తెరకెక్కించిన రాజుగారి గది విజయాన్ని అందుకుంది. ఆ ఉత్సాహంతోనే రాజుగారి గది 2 తీశారు. ఇప్పుడు మూడో భాగం కూడా మొదలైపోయింది. తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తోంది. అశ్విన్ కీలక పాత్రధారి. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ క్లాప్‌నిచ్చారు. అలోక్ జైన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి రెండు భాగాల కన్నా మూడో భాగం ఎక్కువ వినోదాన్ని అందిస్తుంది. భయం, వినోదం సమపాళ్లలో మేళవించాం. నేటి నుంచి షూటింగ్ మొదలవుతుందని చిత్రబృందం తెలిపింది. ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, మాటలు: బుర్రా సాయిమాధవ్.













