లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ డేట్ ఖరారు
ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా సెన్షేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 22న విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయగా, అనూహ్యమైన స్పందనను రాబట్టుకుని సినిమాపై అంచనాలను పెంచింది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించే చిత్రం. ప్రీరిలీజ్ బిజినెస్ గురించి వస్తున్న కథనాలను నమ్మొద్దని, డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇంకీ ఎవరికీ ఇవ్వలేదని ఈ చిత్ర నిర్మాణతలు క్లారిటీ ఇచ్చారు. కళ్యాణి కోడూరి సంగీతం అందించిన ఈ చిత్రానికి రాకేష్‌రెడ్డి, దీప్తి బాలగిరి సంయుక్తంగా నిర్మించారు.













