రష్మిక, కీర్తికి ఆ విషయంలో పోటీ లేరు
ప్రస్తుతం టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి హీరోయిన్ల కొరత బాగానే ఉందని చెప్పాలి. స్టార్ హీరోయిన్ సమంత హెల్త్ ఇష్యూస్ వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెకేషన్స్ కు వెళ్తుంది. అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో కంబ్యాక్ ఇచ్చినా మునుపటిలా ఛాన్సులు రావడం లేదు. తమన్నా, కాజల్ కు సోలోగా బాక్సాఫీస్ ను దున్నే దమ్ము లేదు. పోనీ యంగ్ హీరోయిన్స్ తో చేద్దామంటే వాళ్లు వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. దానికి తోడు కొత్త వాళ్లను నమ్మి కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడమంటే రిస్కే. దీంతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు రష్మిక మందన్నా, కీర్తి సురేష్ మాత్రమే నిర్మాతలకు ఆప్షన్ గా మిగిలారు.
రష్మికకు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పటికే రెయిన్ బో అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాను సెట్స్ పైకి కూడా తీసుకెళ్లింది రష్మిక. దీంతో పాటూ రీసెంట్ గా మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం.
వాస్తవానికి ఈ సినిమా సమంత చేయాల్సింది కానీ సమంత ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో ఆ సినిమా రష్మిక కు దక్కింది. ఇక కీర్తి ఇప్పటికే మహానటి సినిమాతో ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. దాని తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవేమీ అనుకున్న స్థాయిలో వర్కవుట్ అవలేదు. కానీ సరైన కథ దొరికితే కీర్తికి ఆ స్టామినా ఉందనేది మాత్రం వాస్తవం. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకుందని, ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాను ఓ యువ దర్శకుడు రూపొందించనున్నట్లు సమాచారం.













