Kyle Paul: టాక్సిక్ కోసం కన్నడ నేర్చుకుంటున్న అమెరికా నటుడు
కెజిఎఫ్(KGF) ఫ్రాంచైజ్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ అందుకున్నాడు రాక్ స్టార్ యష్(Yash). ఆ సినిమాలు రాకముందు కేవలం కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైన యష్ ఆ తర్వాత దేశమంతటా పాపులర్ అయ్యాడు. కెజిఎఫ్ సినిమాలతో వచ్చిన క్రేజ్ ను నిలుపుకోవాలనే ఉద్దేశంతో తర్వాతి సినిమాకు ఎంతో టైమ్ తీసుకుని మరీ గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) చెప్పిన కథకు ఓకే చెప్పాడు.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ లో కూడా రిలీజ్ కానుంది. అందులో భాగంగానే ఈ మూవీలో పలువురు హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. టాక్సిక్(Toxic) మూవీకి హాలీవుడ్ లెవెల్ లో క్రేజ్ పెంచాలనే ఆలోచనతో గీతూ హాలీవుడ్ కు చెందిన పలువురిని రంగంలోకి దింపింది. ఈ మూవీలో అమెరికా యాక్టర్ కైల్ పాల్(kyle paul) ఓ కీలక పాత్ర చేస్తున్నాడు.
తాజాగా ఆయన టాక్సిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. తాను టాక్సిక్ అనే ఒక ఇండియన్ మూవీకి వర్క్ చేస్తున్నానని, ఆ సినిమా కోసం తాను భారతీయ భాషల్లో ఒకటైన కన్నడ కూడా నేర్చుకుంటున్నానని, ఈ సినిమాకు వర్క్ చేయడం తనకు బెస్ట్ ఎక్స్పీరియెన్స్ ను ఇచ్చిందని పాల్ అన్నారు. పాల్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. టాక్సిక్ లో నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, యష్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది.













