మైత్రితో విజయ్ కి చేదు అనుభవమే!!
టాలీవుడ్ నిర్మాణ సంస్థల్లో టాప్ లిస్ట్ లో ఉన్న ప్రొడక్షన్ హౌస్‌ల్లో ‘మైత్రి మూవీ మేకర్స్స ఒకటి. చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా తెలుగులోని స్టార్ హీరోలకి కలెక్షన్ల పరంగా, వారి వారి కెరీర్ బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చిన ప్రతిభ మైత్రి సంస్థకే ఉంది. సినిమాలు కానీ, వాటి రేంజ్ పరంగా కానీ చూసినా గట్టి పోటీ ఇస్తున్న సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.
ఇంతమంది అగ్ర హీరోలకి కలిసొచ్చిన మైత్రీ సంస్థ, యువ హీరో అయిన విజయ్ దేవరకొండకి మాత్రం చేదు అనుభవాలు మిగిలించింది. విజయ్ తో మూడు సినిమాలు చేస్తే ఆ మూడు భారీ నష్టాలే మిగిల్చింది. మైత్రీ సంస్థ విజయ్ మొదటి సినిమా ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా కథ పరంగా బాగానే ఉన్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం నష్టమే చేకూరింది. ఆ తరువాత విజయ్ తో ‘హీరో ‘ అనే మూవీ సినిమాని మొదలు పెట్టారు. కానీ కొన్ని యాక్షన్ సీన్స్ తీశాక ఆ సినిమాని ఆపేసారు. అప్పటికే కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన మైత్రీ సంస్థ మొత్తం సినిమా పూర్తి చేస్తే ఇంకా నష్టం వస్తుందనే ఉద్దేశంతో ఈ మూవీని ఆపేసారు.
తన వల్ల కలిగిన నష్టాన్ని ఎలా అయిన భర్తీ చేయాలనుకుని మైత్రితో మరో సినిమా చేయాలనుకున్నాడు విజయ్. అలా వచ్చిన సినిమానే ‘ఖుషి’ . శివ నిర్వాణ లాంటి డైరెక్టర్ కాబట్టి ఖుషి సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఈ మూవీ సాంగ్స్ కూడా మంచి పాజిటివ్ టాక్ కి దగ్గరగా తీసుకొచ్చాయి. కానీ సినిమా మాత్రం అంచనాలను తారుమారు చేస్తూ వీకెండ్ నే బోల్తా కొట్టింది. సినిమాని మంచి లాభాలకే బేరం కుదుర్చుకున్నా, ఏపీ లో అయితే మరీ డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా నష్టాన్నే మిగిలింది. దానితో పాటు నైజాంకి కూడా నష్టాన్ని తీసుకొచ్చింది. విజయ్ దేవరకొండ తో మైత్రి మూవీస్ ఏ మూవీ ప్లాన్ చేసిన నష్టాలే కలుగుతున్నాయి. మరి మన అర్జున్ రెడ్డి తరువాత ఏదైనా హిట్ కొట్టి ఆ నష్టాలకు తగిన న్యాయం చేస్తాడో లేదో వేచి చూడాల్సిందే.













