Kuberaa: కుబేర రన్ టైమ్ ఎంతంటే?

తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush) హీరోగా టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar kammula) దర్శకత్వంలో వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా కుబేర(kubera). అక్కినేని నాగార్జున(Akkineni nagarjuna) కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా(rashmika mandanna) హీరోయిన్ గా నటించగా, దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) మొదటిసారి శేఖర్ కమ్ముల సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. జూన్ 20న కుబేర ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే కుబేరపై మంచి అంచనాలుండగా, రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను ఇంకాస్త పెంచింది. దీంతో ఎప్పుడెప్పుడు కుబేర సినిమా చూద్దామా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటిసారి శేఖర్ కమ్ముల తన స్టైల్ జానర్ ను వదిలి కుబేరను కొత్తగా ట్రై చేశారు. ఇదిలా ఉంటే కుబేర మూవీ రన్ టైమ్ గురించి మేకర్స్ తాజాగా అప్డేట్ ఇచ్చారు.
రిలీజ్ లో భాగంగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను ఇచ్చిందని తెలియచేశారు. దీంతో పాటూ సినిమా నిడివి గురించి కూడా మేకర్స్ రివీల్ చేశారు. కుబేర సినిమా 3 గంటల 1 నిమిషం నిడివితో రిలీజ్ కానుందని తెలిపారు. మూడు గంటలంటే పెద్ద సినిమా అనే చెప్పాలి. అయినా సినిమాలో కంటెంట్ ఉంటే రన్ టైమ్ అనేది పెద్ద సమస్య కాదని ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి.