కుబేర వచ్చెదెప్పుడు?
శేఖర్ కమ్ముల నుంచి ఆఖరిగా వచ్చిన లవ్ స్టోరీ సినిమా కమర్షియల్ గా బాగా వర్కవుట్ అయింది. అయినప్పటికీ శేఖర్ కమ్ముల చాలా గ్యాప్ తీసుకుని తన తర్వాతి సినిమాను ధనుష్ తో చేస్తున్నాడు. కుబేర అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున మరో హీరోగా కనిపించనున్నాడు.కుబేరలో నాగ్ ఎలాంటి పాత్ర చేస్తున్నాడనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇదిలా ఉంటే కుబేర షూటింగ్ ఆల్మోస్ట్ తుది దశకు చేరుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. కుబేర గ్లింప్స్ చూస్తుంటే ఈసారి శేఖర్ కమ్ముల లవ్ స్టోరీని కాకుండా ఏదో ఇంట్రెస్టింగ్ కథను చెప్పబోతున్నట్లు అర్థమవుతోంది. పాన్ ఇండియ లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వాస్తవానికి ఈ ఏడాదిలోనే కుబేరను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ లో పుష్ప2 మరోసారి పోస్ట్ పోన్ అయితే ఆ డేట్ లో కుబేరను రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట. ఇప్పటివరకు తను ఫాలో అయిన లైన్ నుంచి బయటికొచ్చి మరీ శేఖర్ కమ్ముల ఈ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













