Kubera: ఎట్టకేలకు కుబేర ఫిక్స్ చేసుకున్నాడు!
ధనుష్(Dhanush) హీరోగా నాగార్జున(nagarjuna) కీలక పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కుబేర(Kubera). విజనరీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో వస్తున్న కుబేరలో రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్లో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న జిమ్ సర్బ్(Jim Sarb) ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.
వీరంతా తమ కెరీర్లో మునుపెన్నడూ కనిపించని పాత్రల్లో కుబేర లో కనిపించనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో కుబేర కూడా ఒకటి. ఎప్పటినుంచో రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 20న కుబేర సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ పోస్టర్ లో నాగార్జున, ధనుష్ ఒకరికి ఎదురుగా మరొకరు చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించగా, జిమ్ సర్బ్ బ్యాక్ గ్రౌండ్ లో చాలా పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తున్నాడు. 90వ దశకం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ఓ బిచ్చగాడు ధనవంతుడిగా మారితే అతనికి ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతుంది. సునీల్ నారంగ్(Suneel Narang), రామ్ మోహన్ రావు(Ram Mohan rao) ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించగా, దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.













