మీరాచోప్రా విషయం లో వెంటనే స్పందించిన కె టి ఆర్
హీరోయిన్ గా రన్నింగ్ లో వున్నా ఇంత పాపులారిటీ వస్తుందో తెలీదు కానీ.. మీరాచోప్రాకు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా జాతీయ స్థాయిలో పేరు వచ్చేసింది. అయితే ఏదైనా ఒక సినిమాలో నటించడం ద్వారా వచ్చిన పేరు అయితే బాగుండేది. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దారుణమైన ధూషణల ద్వారా మీరా చోప్రా వెలుగులోకి వచ్చింది. గత నాలుగైదు రోజులుగా మీరా చోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం, మాటల యుద్దం, బూతుల పురాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం ఢిల్లీకి చేరడమే కాదు, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల వద్దకు కూడా చేరింది. ఆ విషయాలు ఇవి మీరా చోప్రా జూన్ 1న తన అభిమానులతో ట్విట్టర్లో చాట్ చేసింది. ఈ క్రమంలో జూ. ఎన్టీఆర్ గురించి చెప్పండని అడిగితే.,. అతను ఎవరో తెలీదని, ఆయన ఫ్యాన్‌ను కాదని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ ఎవరో తెలీదని చెప్పడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ తెగ హర్ట్ అయ్యారు. తమ హీరోను కించపరిచేలా మాట్లడటంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో వారి నుంచి ఎవ్వరినీ వదలి పెట్టకుండా తిట్టని తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. వేలల్లో వస్తున్న ఈ ట్వీట్లపై మీరాచోప్రా విసుగుచెంది.. జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేసింది. మీరా చోప్రాకు ఈ వ్యవహారంలో చిన్మయి కూడా తోడుగా నిలిచింది. మీరా చోప్రా.. తనను వేధిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనితకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసింది. తాజాగా కేటీఆర్, కవితలకు కూడా తన బాధను వివరించింది.
తనను గ్యాంగ్ రేప్ చేస్తానని, యాసిడ్ ఎటాక్ చేస్తామని, బూతులు తిడుతున్నారని కొన్ని స్క్రీన్ షాట్లను అటాచ్ చేస్తూ కేటీఆర్, కవితలకు ట్వీట్ చేసింది. వీటిపై కేటీఆర్ స్పందిస్తూ.. “మేడమ్ ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర డీపీజీ, హైద్రాబాద్ కమిషనర్‌కు అప్పగించానని తెలిపాడు.” మీ ఫిర్యాదుకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. ఈ లెక్కన ఎన్టీఆర్ ఫ్యాన్స్ చిక్కుల్లో పడ్డట్టే. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.













