కృతిసనన్ కి మరోసారి ఛాన్స్ ఇచ్చిన సుకుమార్?

కృతిసనన్ ని వెండితెరకి పరిచయం చేసిన సుకుమారే అన్న విషయం తెలిసిందే! .. మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి కృతి సనన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా, కృతి సనన్ నటనకు, గ్లామర్ కు మాత్రం మంచి మార్కులేపడ్డాయి. ఆ తరువాత నాగ చైతన్య తో ‘దోచేయ్’ సినిమాలో నటించింది. అయినా సరే టాలీవుడ్ లో నిలదొక్కుకోలేక పోయింది. ఆ తరువాత ఓ పది హిందీ సినిమాలలో నటించిన కృతి ప్రస్తుతం ప్రభాస్‌తో ‘ఆదిపురుష్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కృతి సనన్ టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిందట. బాలీవుడ్‌లో టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన ‘హీరోపంతి’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతికి అక్కడ మంచి సక్సెస్ లభించింది.
ఆ తర్వాత బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ.. అసలు దక్షిన సినీ పరిశ్రమ వైపు చూడటమే మానేసింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా.. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’లో కృతి సీత పాత్రలో నటిస్తోంది. తన రాబోయే సినిమాలో హీరోయిన్‌గా నటించాలంటూ ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆమెను కోరినట్లు తెలుస్తోంది. దీంతో పాటు బాలీవుడ్‌లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టు చేస్తుంది. అయితే త్వరలో కృతి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనుందని టాక్ బలంగా వినిపిస్తోంది. మళ్లీ ఆమె తెలుగు రీఎంట్రీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్న సుకుమార్.. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఒక సినిమా, రామ్ చరణ్‌తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఒకదాంట్లో హీరోయిన్‌గా చేయాలని సుకుమర్ కృతిని కోరినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె సుక్కు ప్రపోజల్‌కి ఓకే చెప్పినట్లు టాక్. మరి ఆదిపురష్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారనున్న కృతి సనన్ కి మరో సారి టాలీవుడ్ రీఎంట్రీ కలిసోస్తుందో లేదో వేచి చూడాల్సిందే !