రిస్క్ లో కృతి కెరీర్
ఉప్పెన సినిమాతో డెబ్యూ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఉప్పెన సినిమా వచ్చినప్పుడు కృతి హాట్ టాపిక్ అయింది. యూత్ తో పాటూ, దర్శక నిర్మాతలు కూడా కృతి వెంట క్యూ కట్టారు. ఇప్పుడు శ్రీలీల చూస్తున్న స్టార్ డమ్ ఈ అమ్మడు అప్పుడే ఎంజాయ్ చేసింది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సక్సెస్లతో ఈ అమ్మడుకి ఇక తిరుగులేదనుకున్నారంతా.
కట్ చేస్తే వరుసగా నాలుగు సినిమాలు డిజాస్టర్లవడంతో కృతి మార్కెట్ బాగా డల్ అయింది. దీంతో అవకాశాలు రావడం తగ్గాయి. రీసెంట్గా వచ్చిన కస్టడీ కూడా కృతి ఆశలను తీర్చలేదు. దీనికంటే ముందు వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం మూడూ ఒకదాన్ని మించి మరొకటి కృతికి గట్టి దెబ్బ కొట్టాయి.
దానికితోడు తమిళంలో బాలా డైరెక్షన్ లో హీరో సూర్య హీరోగా మొదలుపెట్టిన సినిమా కొద్దిరోజులకే క్యాన్సిల్ అయింది. ఈ సినిమా కంప్లీట్ అయి రిలీజై ఉంటే కోలీవుడ్ లో గుర్తింపుతో పాటూ బాలా సినిమా కాబట్టి మంచి క్యారెక్టర్ కూడా దొరికిఉండేది. అది అనుకోకుండా చేజారింది. దీంతో ఇప్పుడు కృతి ఆశలన్నీ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మీదే ఉన్నాయి.
దీంతో పాటూ మలయాళంలో టోవినో థామస్తో డెబ్యూ చేస్తుంది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిస్తేనే కృతి మునుపటిలా మంచి అవకాశాలు అందుకోగలదు. అసలే శ్రీలీల అస్సలు తీరిక లేకుండా రెండు చేతులా సినిమాలతో బిజీగా ఉంది. స్టార్ హీరోయిన్లకు సైతం సక్సెస్ ఉంటేనే ఈ ఇండస్ట్రీలో ఛాన్సులు. అలాంటిది కృతి లాంటి హీరోయిన్ ఇలా ఫ్లాపులతో డౌన్ అవుతుంటే కెరీ్ర రిస్క్ లో ఉందనే అనుకోవాలి.













