గణపత్ కోసం కృతి బైక్ విన్యాసాలు
యువహీరో టైగర్‌ష్రాఫ్, కథానాయిక కృతిసనన్ ఏడేళ్ల విరామం తర్వాత వీరిద్దరి కలసి గణపత్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తొలిసారి తన కెరీర్లో పోరాట ఘట్టాల్లో భాగం కాబోతున్నానని చెప్పింది కృతిసనన్. ఇందుకోసం ఆమె బైక్ రైడింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుందట. కృతిసనన్ మాట్లాడుతూ తాజా చిత్రం బచ్చన్ పాండే చిత్రంలో నేను బుల్లెట్‌ను నడిపాను. అయితే గణపత్ లో మాత్రం డర్ట్‌బైక్ (పర్వత ప్రాంతాల్లో నడిపే ప్రత్యేకమైన బైక్) నడపడంలో శిక్షణ తీసుకుంటున్నా. త్వరలో హాలీవుడ్ తరహాలో నా మీద బైక్ విన్యాసాలను చిత్రీకరించబోతున్నారు. బాలీవుడ్లో యాక్షన్ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న టైగర్ ష్రాఫ్‌తో కలిసి పోరాటాల్లో పాలుపంచుకోవడం ఉత్సాహంగా అనిపిస్తోంది అని చెప్పింది. కొద్ది మసాల క్రితం డర్ట్‌బైక్ రైడ్ చేస్తున్న కృతిసనన్ పోస్టర్‌ను చిత్ర బృందం సోషల్ మీడియాతో విడుదల చేసింది. ఈ చిత్రానికి వికాస్ భల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కృతిసనన్ పాన్ ఇండియా పౌరాణిక చిత్రం ఆదిపురుష్ లో ప్రభాస్ సరసన సీత పాత్రలో నటిస్తోంది.













