‘కృతి సనన్’ పరిస్థితి తాను దూర కంత లేదు మెడకో డోలు అన్నట్టు వుంది
తెలుగు చిత్రపరిశ్రమలో సోదరి బంధం తో నటులైన వారు కోకొల్లలు అలనాడు తంజావూరు సిస్టర్స్ లలిత, పద్మిని, రాగిణి, గతంలో షాపుకారు జానకి-కృష్ణకుమారి, నగ్మా-రోషిని, ఆర్తీ అగర్వాల్-అతిధి అగర్వాల్, ప్రియాంకా చోప్రా-పరిణీత చోప్రా, కాజల్ అగర్వాల్-నిషా అగర్వాల్, ఇలా ఎందరో తమకున్న పలుకుబడితో తమ సోదరిలను కూడా సినీ పరిశ్రమకు తెచ్చి, హీరోయిన్లు గా ప్రోత్సహించడం జరుగుతుంది. అలాంటి కేవలోకే మరో భామ కూడా చేరుతోంది. తెలుగు వారికి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు కృతి సనన్. మోడలింగ్ నుంచి నటనా రంగంలోకి వచ్చిన ఈ భామ మొదటి చిత్రమే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు సరసన అందునా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘1 నేనొక్కడినే’ చిత్రంతో పరిచయంఅయింది. ఈ చిత్రం బాగా ఆడకపోయినా ఈమె మహేష్‌తో నటించేసరికి తెలుగు వారికి బాగా గుర్తుండిపోయింది
ఆ తర్వాత నాగచైతన్య హీరోగా నటించిన ‘దోచెయ్’ చిత్రంలో కూడా ఈమె నటించింది. ఈ చిత్రం కూడా నిరాశపరిచింది. దాంతో ఇక ఇక్కడ లాభం లేదని ఈ భామ బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ మాత్రం ఈమెని అదృష్టం బాగానే పలకరించింది. హీరో పంటి, దిల్ వాలే, లూకా చుప్పి, బరేలీకి బర్ఫీ, పానిపట్, హౌస్ ఫుల్ 4 వంటి సూపర్ హిట్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. కృతి సనన్ గ్లామర్ పాత్రలు చేస్తూనే నటనకు కూడా ప్రాధాన్యం ఉన్న చిత్రాలలో కూడా నటిస్తోంది. ఈ హాట్ బ్యూటీకి నూపుర్ సనన్ అనే సోదరి ఉంది. నూపుర్ ఓ ప్రైవేట్ ఆల్బం ద్వారా ఫేమస్ అయింది. “ఫిల్హాల్” అనే పాట లో అక్షయ్ కుమార్ తో నటించింది. ‘ఏ దిల్ హై ముస్కిల్’ చిత్రం లో “ఛన్న మేరియా” అనే పాటతో యూట్యూబ్ లో ఎంతో పాపులర్ అయ్యింది.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కృతి సనన్ తన సోదరి నూపుర్ సనన్ని కూడా బాలీవుడ్ హీరోయిన్గా పరిచయం చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయం గురించి కృతిసనన్ నే అడుగగా.. నూపుర్ నా కన్నా ఎంతో టాలెంటెడ్ అమ్మాయి తను తన కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది… అని నమ్మకంగా చెబుతోంది. దాంతో కొందరు కృతి సనన్ కే ఇంకా దిక్కులేదు. తానే అవకాశాల కోసం నానా తంటాలు పడుతుంటే … మరి ఈమె తన చెల్లెలిని రికమండ్ చేసే స్థాయికి చేరుకుందా? ముందు నీ సంగతి చూసుకో.. ముందు నీలోని టాలెంట్‌ని చూపించు. తర్వాత నీ చెల్లి టాలెంట్ గురించి మేము చెపుతాం. నీకే సరైన అవకాశాలు లేకపోతే ఇక నువ్వు నీ చెల్లెలిని ఎలా ప్రమోట్ చేస్తావు? అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక కృతిసనన్ సోదరి నూపుర్ సినీ రంగంలోకి అడుగు పెట్టి ఎంత దూరం వెళ్తుందో చూడాలి? మార్చ్ 13న విడుదలైన అంగ్రేజ్ మీడియం లో కృతి సనన్ హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క చిత్రం ‘మిమి’ మాత్రమే ఉంది.













