పక్క భాషల నుంచి కృతికి ఆఫర్లు
ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టికి ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఇక ముందు తిరుగుండదనుకున్నారంతా. దానికి తగ్గట్టే అమ్మడుకు అవకాశాలు కూడా బాగా వచ్చాయి. నాని, నాగ చైతన్య, రామ్, నితిన్ ఇలా మీడియం రేంజ్ హీరోలందరితో ఛాన్సులు అందుకుంది. కానీ వాటిలో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు మినహా మిగిలిన హీరోలతో చేసిన సినిమాలన్నీ ఫ్లాపులే.
దీంతో అమ్మడి మార్కెట్ పడిపోయింది. దానికి తోడు అదే టైమ్ లో శ్రీలీల ఎంటరవ్వడం, ఈమె ప్లేస్ ను ఆమె భర్తీ చేయడం జరిగిపోయాయి. క్రమంగా కృతికి టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో శర్వానంద్ సినిమా ఒక్కటే ఉంది. కానీ కోలీవుడ్ నుంచి మాత్రం కృతికి ఆఫర్లు బాగానే వస్తున్నాయి.
కార్తీతో వా వాతియారే, జయం రవితో జెనీలో జోడీ కట్టిన కృతి, తాజాగా ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ఓకే చెప్పింది. మళయాళంలో అజయంటే రండం మోశానంలో టోవినో థామస్తో కూడా ఓ సినిమా చేస్తుంది. ఇవన్నీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే కృతి లక్ బాగున్నట్లే అనుకోవాలి. టాలీవుడ్ నుంచి ఆఫర్లు లేకపోయినా వేరే భాషల నుంచి మాత్రం బాగానే ఆఫర్లొస్తున్నాయి. శర్వానంద్ తో చేస్తున్న సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో కూడా మళ్లీ అమ్మడికి అవకాశాలొస్తాయి.













