Krithi Shetty: అప్పుడు చైల్డ్ ఆర్టిస్టే ఇప్పుడు హీరోయిన్

టాలీవుడ్ లో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుని వారి మనసుల్ని దోచిన వారున్నారు. వారిలో కొంతమంది ఇప్పటికీ ఆర్టిస్టులుగానే కొనసాగుతుంటే కొందరు హీరోలు, హీరోయిన్లుగా మారి ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు. తేజ సజ్జ(teja Sajja), సంతోష్ శోభన్(Santhosh Sobhan), సంగీత్ శోభన్(Sangeeth Sobhan) ఇప్పటికే హీరోలుగా మారారు.
వాళ్లతో పాటూ కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyanram), శ్రీవిద్య(Sri Vidya), ఎస్తేర్(Ester) లాంటి బాల్య నటులు కూడా ఇప్పుడు హీరోయిన్లుగా అవకాశాలు అందుకుని సక్సెస్ అవాలని చూస్తున్నారు. కానీ బాలనటిగా నటించిన ఓ అమ్మడు మాత్రం ఇప్పుడు హీరోయిన్ గా మారి చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలోని హీరో పక్కన హీరోయిన్ గా నటించే ఆఫర్ అందుకుంది.
తను మరెవరో కాదు కృతి శెట్టి(Krithi Shetty). కృతి తన కెరీర్ ను పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ లో నటించడం ద్వారా మొదలుపెట్టింది. ఆ తర్వాత 2019లో సూపర్ 30లో ఓ చిన్న పాత్ర ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే దాని కంటే ముందే కార్తీ హీరోగా నటించిన నా పేరు శివ(na Peru siva) సినిమాలో కృతి చిన్న పాపగా కనిపించి అందులో కార్తీ(Karthi)కి చేయి ఊపుతుంది. అప్పుడ కార్తీ మూవీలో చిన్న పూపగా క్యూట్ గా ఉన్న కృతినే ఇప్పుడు కార్తీ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. నలన్ కుమారసామి(Nalan Kumarasaami) దర్శకత్వంలో వస్తోన్న కార్తీ చేస్తున్న వా వాతియార్(Vaa Vathiyar) లో కృతినే హీరోయిన్.
https://www.instagram.com/