Krithi Shetty: బాలీవుడ్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న బేబమ్మ

పంజా వైష్ణవ్ తేజ్(vaishnav tej) హీరోగా వచ్చిన ఉప్పెన(uppena) సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి(krithi shetty). మొదటి సినిమాతోనే మంచి నటిగా ప్రూవ్ చేసుకోవడంతో పాటూ ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో కృతికి అవకాశాలు కూడా బాగా వచ్చాయి. అందుకే తక్కువ టైమ్ లోనే హీరోయిన్ గా బాగా పాపులరైంది కృతి. వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.
కృతి వరుస పెట్టి సినిమాలైతే చేసింది కానీ అవేవీ అమ్మడికి స్టార్ స్టేటస్ ను తీసుకుని రాలేదు. పైగా కృతి నటించిన గత కొన్ని సినిమాలు ఫ్లాపులవడంతో అమ్మడు కాస్త వెనుక పడింది. దీంతో తన ఫోకస్ ను బాలీవుడ్ కు మార్చి అక్కడ సినిమాలు చేసి సత్తా చాటాలనుకుంది. అందులో భాగంగానే బాలీవుడ్ యాక్టర్ గోవింద(govinda) తనయుడు యశ్వర్ధన్ అహుజ(Yaswardhan Ahuja) హీరోగా నటిస్తున్న మూవీలో కృతి హీరోయిన్ గా లాంచ్ కావాల్సింది.
కానీ ఇప్పుడు ఆ సినిమా నుంచి కృతి తప్పుకున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో లాగానే బాలీవుడ్ లో కూడా మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని అక్కడ దూసుకెళ్లాలని ఎన్నో కలలు కనింది కృతి. కానీ ఇప్పుడవన్నీ కలలుగానే మిగిలాయని ఆమె ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. అయితే ఈ సినిమా నుంచి కృతి ఎందుకు తప్పుకుందనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.