ఆత్మగా బేబమ్మ
ఉప్పెనతో మంచి విజయాన్ని అందుకున్న కృతి శెట్టికి ఆ తర్వాత సక్సెస్ ట్రాక్ కొనసాగింది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజుతో హ్యాటిక్ అయితే పూర్తి చేసింది కానీ తర్వాత వరుసగా రెండు డిజాస్టర్లను అందుకుంది. రామ్ హీరోగా ది వారియర్, నితిన్ హీరోగా వచ్చిన మాచర్ల నియోజకవర్గం రెండు సినిమాలూ దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఇప్పుడు బేబమ్మ ఆశలన్నీ ఈ నెల 16న రాబోతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మీదే పెట్టుకుంది.
మోహనకృష్ణ ఇంద్రగంటి హీరోయిన్లను కళాత్మకంగా చూపిస్తాడన్న పేరుంది. ఏకంగా తన మీదే టైటిల్ పెట్టడంతో ఒక వేళ సినిమా హిట్ అయితే మాత్రం మార్కెట్ అమాంతంగా పెరిగే అవకాశముందని బలంగా నమ్ముతుంది కృతి. దీంతో పాటూ కృతి, నాగచైతన్య హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్‌కు భారీ అంచనాలున్నాయి.
ఈ సినిమా గురించి రీసెంట్గా ఓ అప్డేట్ నెట్టింట్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో కృతి హారర్ టచ్ ఉన్న ఆత్మ పాత్రలో కనిపిస్తుందట. అలాగని కృతి దెయ్యం కాదని ఓ విభిన్న నేపథ్యంలో ఆ క్యారెక్టర్ని స్పెషల్‌గా డిజైన్ చేసినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. మెయిన్ హీరోయిన్ తనే కాబట్టి ఏదో ట్విస్ట్ ఉండే ఛాన్స్ ఉంది.













