“ఖుషి” లో కొత్త హీరోయిన్..?
సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో స్టార్ట్ అయిన ఖుషి మూవీ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘ టక్ జగదీశ్ ‘ తో ప్రేక్షకులని నిరాశ పరిచినప్పటికీ, తనకి పట్టు ఉన్న లవ్ స్టోరీ లైన్ తో ఈసారి మెప్పించడానికి రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమా ఖచ్చితంగా హిట్ సాధిస్తుంది అనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రకటించిన కొన్ని రోజులకే షూటింగ్ స్టార్ట్ చేసారు. చకచకా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకుంటున్న తరుణంలో సడెన్ గా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ‘లైగర్’ ప్రమోషన్లు , రిలీజ్ కోసం విజయ్ కొంతకాలం బ్రేక్ తీసుకోగా , ‘యశోద’ బ్యాలన్స్ వర్క్ పూర్తి చేయడం కోసం సామ్ కొంతకాలం బ్రేక్ ఇచ్చింది.
ఇంతలో సామ్ అనారోగ్యం కారణంగా షూటింగ్స్ కి అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం సమంత ఆరోగ్యం కుదుటపడినప్పటికీ ఇపుడుడప్పుడే షూటింగ్స్ కి రాదనీ సన్నిహితులు వెల్లడించారు. ఇప్పుడు ” ఖుషి ” సినిమా గురించి ఒక కొత్త వార్త ఆసక్తి కలిగిస్తుంది. ఈ సినిమాకి విజయ్ సరసన కొత్త హీరోయిన్ ని తీసుకుంటున్నట్టు నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఈ సమాచారం వినగానే అనారోగ్యం వల్ల సామ్ ప్లేస్ ని మరొక హీరోయిన్ తో రీప్లేస్ చేస్తున్నారేమోనని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదట, ఈ సినిమాలో సామ్ తో పాటు మరొక హీరోయిన్ కి కూడా చోటు ఉందని తెలిసింది. ఇక ఈ పాత్రకి ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టిని ఫైనలైజ్ చేశారట. కృతిది ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని సమాచారం.
సామ్ మళ్ళీ న్యూ ఇయర్ నుండి ఈ సినిమా షూటింగ్ లో భాగమవుతారని అంచనా వేస్తున్నారు. ఈలోపు విజయ్ , కృతి మధ్య జరిగే సన్నివేశాలని షూట్ చేస్తారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 23 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. షూటింగ్ ఆలస్యమవడం వల్ల వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ వాయిదా పడింది.













