మరో కోలీవుడ్ ఆఫర్ పట్టేసిన కృతి
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయిన కృతి శెట్టి, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుని వరుస అవకాశాలు అందుకుంది. తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంటుందనుకున్న కృతి చేసిన మొదటి నాలుగు సినిమాలు హిట్ అయినా తర్వాత మాత్రం కెరీర్ చాలా డల్ గా సాగింది.
అమ్ముడు చేసిన సినిమాలు డిజాస్టర్లు అవడంతో ఫలితంగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. వరుస ఫ్లాపుల కారణంతో చేతి వరకు వచ్చిన పెద్ద హీరోల సినిమాలు కూడా చేజారిపోయాయి. సూర్య సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లే అందుకున్న కీర్తికి ఆ సినిమా క్యాన్సిల్ అవడంతో నిరాశే మిగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో కృతికి కోలీవుడ్ నుంచి ఓ బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
జయం రవి హీరోగా రూపొందనున్న జీనీ సినిమాలో కృతి శెట్టికి అవకాశం లభించినట్లు సమాచారం. వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. వారిలో కళ్యాణి ప్రియదర్శన్, వామిక తో పాటూ కృతి శెట్టి కూడా ఒకరని టాక్. మరి ఈ సినిమా అయినా అమ్మడుకు మంచి ఫలితాన్నిస్తుందో లేదో చూడాలి.













