వారిద్దరికీ అసలు కలిసి రావట్లేదుగా!
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవిధంగా చెప్పాలంటే లైఫ్ సెట్ అయినట్లే. కానీ ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలకు మాత్రం ఓ రకమైన శాపం ఉన్నట్లనపిస్తుంది. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వీరిద్దరూ ఇప్పుడు వరుస ఫ్లాపులతో ఫామ్ లో లేకుండా పోయారు.
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా, వెనుక చాలా మంది హీరోల సపోర్ట్ ఉన్నప్పటికీ వైష్ణవ్ నుంచి వస్తున్న సినిమాలు అన్నీ నిరాశ పరుస్తూనే ఉన్నాయి. దానికి తోడు వైష్ణవ్ సెలెక్ట్ చేసుకుంటున్న స్క్రిప్ట్స్ కూడా అలానే ఉంటున్నాయి. తన స్థాయికి మించిన పాత్రలు ఎంచుకోవడం వల్లే ఇలా అవుతుందని చాలా మంది అంటున్నారు.
వైష్ణవ్ నుంచి వచ్చిన రంగ రంగ వైభవంగా, ఆదికేశవ సినిమాలు రెండూ ఫ్లాపులుగా మిగిలాయి. దీంతో వైష్ణవ్ తర్వాతి సినిమా ఎవరితో చేసినా సరే బజ్ తెచ్చుకోవడం కష్టమే. మరోవైపు కృతి శెట్టి కెరీర్ కూడా అలానే ఉంది. కెరీర్ స్టార్టింగ్ లో వరుస హిట్లు అందుకున్న కృతికి గత కొన్ని సినిమాలుగా డిజాస్టర్లే ఎదురయ్యాయి. ప్రస్తుతం కృతి చేతిలో ఉన్నది ఒక్కటే సినిమా. అది కూడా శర్వానంద్‌తో. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయితే కృతికి మళ్లీ ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది. లేదంటే అమ్మడి కెరీర్ డల్ అవడం ఖాయం.













