Krithi Shetty: ఆ హీరోకు ఎలాంటి ఫిల్టర్లు లేవు
ఉప్పెన(uppena) మూవీతో హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసిన కృతి శెట్టి(Krithi Shetty) మొదటి సినిమాతోనే మంచి క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ వల్లే కృతికి ఉప్పెన(uppena) తర్వాత మంచి అవకాశాలొచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఉప్పెన మూవీ కృతి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. కానీ అవేమీ కృతిని స్టార్ హీరోయిన్ ను చేయలేకపోయాయి.
ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ అవన్నీ ఫ్లాపులవడంతో కృతికి క్రమంగా తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేసింది కృతి. అందులో భాగంగానే పలు సినిమాలు చేయగా, ఇప్పుడు కృతి నటించిన రెండు తమిళ సినిమాలు ఒకేసారి వారం గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.
ఆ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న కృతి శెట్టి తన ఫేవరెట్ కో స్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీరు ఇప్పటివరకు వర్క్ చేసిన వారిలో మీకు ఎక్కువ కంఫర్టబుల్ గా అనిపించేదెవరని అడగ్గా వెంటనే అమ్మడు నాగ చైతన్య(Naga Chaitanya) పేరు చెప్పింది. నాగ చైతన్య చాలా హానెస్టీ పర్సన్ అని, తనెప్పుడూ ఎలాంటి ఫిల్టర్లు లేకుండా ఉంటారని చెప్పగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
– Sravani






