త్వరలోనే తెలుగులో జాన్వీ కపూర్ ఎంట్రీ!
బాలీవుడ్లో హీరోయిన్గా ఇప్పుడిప్పుడే ఓ ఇమేజ్ ఏర్పరచుకుంటున్నారు జాన్వీ కపూర్. మూడు హిందీ సినిమాలతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారామె. త్వరలోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రం తీయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో లీడ్ రోల్లో జాన్వీని తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్. కృష్ణవంశీ సూపర్‌హిట్ చిత్రం అంతపురం హిందీ రీమేక్ శక్తి ది పవర్ ని ప్రముఖ నిర్మాత, జాన్వీ తండ్రి బోనీ కపూర్ నిర్మించారు. మరి కుమార్తె తెలుగు ఎంట్రీ గురించి బోనీ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. అయితే లాక్డౌన్ సమయంలో ఓ కథను కృష్ణవంశీ సిద్ధం చేసుకున్నారట. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని సమచారం. ఇప్పటికే జాన్వీ తండ్రి బోనీకపూర్‌తో చర్చించారట. అటువైపు నుంచి రావాల్సిన స్పందన కోసం వేచి చూస్తున్నారట. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ఛాన్స్ కృష్ణవంశీకే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.













