మా డైరీని ఆవిష్కరించిన సూపర్ స్టార్ కృష్ణ
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) డైరీ హైదరాబాద్ అపోలో ఆడిటోరియంలో ఆవిష్కరించారు. సూపర్‌స్టార్ కృష్ణ మా సిల్వర్ జూబ్లీ డైరీ-2019 తొలి ప్రతిని ఆవిష్కరించి రెబల్ స్టార్ కృష్ణంరాజుకు అందించారు. సూపర్‌స్టార్ కృష్ణ-విజయనిర్మల, రెబల్‌స్టార్ కృష్ణంరాజు-శ్యామలాదేవి దంపతులు సంయుక్తంగా మా సిల్వర్ జూబ్లీ డైరీ -2019 ఈబుక్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలోనే మూవీ ఆర్టిస్టుల సంఘం పేద కళాకారుల ఆడ పిల్లల పెళ్లికి కల్యాణ లక్ష్మి పథకం పేరుతో సాయాన్ని ప్రకటించింది. కళ్యాణలక్ష్మి పథకానికి శ్రీమతి విజయనిర్మల రూ.1.5 లక్షలు, శ్యామలాదేవి రూ.1 లక్ష విరాళం ప్రకటించారు. జనవరి నుంచి కళాకారుల్లో పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1లక్ష 16వేల సాయం అందిస్తామని శివాజీ రాజా తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకం స్ఫూర్తితో పేద ఆర్టిస్టుల కోసం కల్యాణ లక్ష్మి ప్రారంభమైందని తెలిపారు. అలాగే మా డైరీ స్పాన్సర్ల్సో అపోలో రూ.14.40 లక్షలు ఇచ్చారని మా ప్రధాన కార్యదర్శి నరేష్ తెలిపారు.













