అనుష్క కోసం వెయిట్ చేస్తున్న క్రిష్
హరిహర వీరమల్లు మొదలుపెట్టి నాలుగేళ్లవుతుంది. అయినా సరే రిలీజ్ ఎప్పుడవుతుందో చెప్పలేని పరిస్థితి. ఏపీ ఎలక్షన్స్ నేపథ్యంలో సినిమాలను పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నికలైపోతేనే సినిమాలకు అందుబాటులోకి వస్తారు. వచ్చినా తన ప్రాధాన్యతల్లో ముందుగా ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయి.
వీరమల్లు కోసం పవన్ డేట్స్ అడ్జస్ట్ చేయాలంటే ఎంత లేదన్నా మరో ఏడాది పడుతుంది. దీంతో క్రిష్ ఈ సినిమా నుంచి మరో ప్రాజెక్ట్ కు షిఫ్ట్ అవాలని చూస్తున్నాడు. ఇప్పటికే చాలా టైమ్ వేస్ట్ చేసిన క్రిష్, వీరమల్లు మొదలయ్యే లోపు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని దాని కోసం స్టోరీని కూడా రెడీ చేసుకున్నాడట.
ఈ సినిమా కోసం అనుష్కను ఇప్పటికే సంప్రదించాడని టాక్. యువి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను రూపొందించనుంది. ఇప్పటికే విశ్వంభర కోసం స్వీటీని యువి క్రియేషన్స్ సంప్రదించగా, దానికి డేట్స్ ఎక్కువ అవసరమవుతాయని, క్రిష్ చెప్పిన స్క్రిప్ట్ కే అనుష్క్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ అనుష్క మాత్రం సినిమాకు ఓకే చెప్పిందని సమాచారం. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశంతో క్రిష్ ఉన్నాడట. మరి ఈ సినిమా ద్వారా అనుష్క, క్రిష్ ఎలాంటి మెసేజ్‌ను ఇవ్వనున్నారో చూడాలి.













