Krish: ఆదిత్య999పై క్లారిటీ ఇచ్చిన క్రిష్

పవన్ కళ్యాణ్(pawan kalyan) తో హరిహర వీరమల్లు(harihara veeramallu) సినిమాను మొదలుపెట్టిన క్రిష్ జాగర్లమూడి(krish jagarlamudi) ఆ సినిమా కోసం చాలా కాలం వెయిట్ చేశారు. ఆ సినిమా లేటవడం, తర్వాత ఏవో వ్యక్తిగత కారణాల వల్ల క్రిష్ వీరమల్లు ప్రాజెక్టు నుంచి బయటికొచ్చి అనుష్క(anushka) తో ఘాటీ(ghaati) అనే సినిమాను చేసి దాన్ని ఇప్పుడు రిలీజ్ కు రెడీ చేశారు. సెప్టెంబర్ 5న ఘాటీ రిలీజ్ కానుంది.
ఘాటీ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న క్రిష్ కు బాలకృష్ణ(balakrishna) డ్రీమ్ ప్రాజెక్టు అయిన ఆదిత్య999(aditya999) సినిమాకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఆదిత్య999 దర్శకత్వ బాధ్యతల్ని బాలయ్య(balayya), క్రిష్(krish) కు అప్పగించారని, ఆ సినిమాలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ(mokshagna) కూడా నటిస్తారని కొన్నాళ్లుగా వార్తలొస్తుండగా ఇదే ప్రశ్నను క్రిష్ ను అడగ్గా దానికి క్రిష్ రెస్పాండ్ అయ్యారు.
ఆదిత్య999 గురించి అనౌన్స్ చేయాల్సింది బాలయ్యేనని, అందులో మోక్షజ్ఞ నటిస్తాడా లేదా అనేది కూడా ఆయనే చెప్పాలని, సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నైనా బాలయ్య చెప్తేనే క్లారిటీ వస్తుందని క్రిష్ అన్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని క్రిష్ ఫ్రెండ్, ఘాటీ నిర్మాత రాజీవ్ రెడ్డి(rajeev reddy)ని అడగ్గా, డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్పారు. కానీ క్రిష్ మాత్రం ఈ సినిమా విషయంలో ఏదైనా బాలయ్య చెప్పాల్సిందే అని ఒకటే ఆన్సర్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారమైతే ఆదత్య999 ఆల్రెడీ లాక్ అయిందని అంటున్నారు.