శీలావతిగా అనుష్క
మొదట్లో సాదా సీదా హీరోయిన్ గా ఎంటర్ అయిన అనుష్క, ఆ తర్వాత టాలీవుడ్ లో హీరోలకు పోటీ ఇచ్చేలా స్టార్ స్టేటస్ దక్కించుకుంది. అరుంధతి సినిమాతో ఆమె స్థాయి వేరని ప్రూవ్ చేసుకున్న అనుష్క.. బాహుబలి, రుద్రమదేవి, భాగమతి సినిమాలతో ఆమె ఇమేజ్ ను మరింత పెంచుకుంది. కానీ గతన కొన్నేళ్ల నుంచి అనుష్క అంత త్వరగా సినిమాలు ఒప్పుకోవడం లేదు.
సినిమా సినిమాకూ చాలా గ్యాప్ తీసుకోవడం, పబ్లిక్ లోకి రాకుండా ఉండటం స్వీటీ ఫ్యాన్స్ కు నిరాశ కలిగిస్తుంది. నిశ్శబ్దం తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుష్క ఆ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంది. ప్రస్తుతం అనుష్క, డైరెక్టర్ క్రిష్ తో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వేదం తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించి నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. క్రిష్- అనుష్క కాంబోలో రానున్న సినిమాకు శీలావతి అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. శీలావతి అనే పేరుతో ఒక చేప ఉన్న విషయం అందరికీ తెలుసు. కానీ టైటిల్ మాత్రం అమ్మాయి శీలాన్ని సూచించే సెటైరికల్ టైటిల్ లా అనిపిస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనున్న ఈ సినిమాలో అనుష్కకు జోఈగా తమిళ యాక్టర్ విక్రమ్ ప్రభు నటిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్సుంది.













