ముద్దుగా ముగ్గురు భామలతో…
గీతగోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం నోటా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విజయ్‌తో సినిమాలు చేసేందుకు చాలా మంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ డేట్స్ గతంలోనే బ్లాక్ చేసిన క్రియేటివ్ కమర్షియల్ అధినేత కె.ఎస్.రామరావు సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కాంత్రిమాధవ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఇదే నెల 18న హైదరాబాద్‌లో మొదలుకానుంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. రాశిఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లెడి హీరోయిన్లుగా నటిస్తారని చిత్రబృందం తెలిపింది. గోపీసుందర్ సంగీతం, జేకే ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కె.ఎస్.రామరావు సమర్పణలో ఆయన కుమారుడు వల్లభ నిర్మిస్తున్నారు.













