ఈ సంక్రాంతికి టాలీవుడ్ ఊహించని షాక్ ఇచ్చిన సినీ ప్రేక్షకుడు
తెలుగు రైతుకు సంక్రాంతి కి బంగారు పంటలైతే…. అయితే టాలీవుడ్ లో నిర్మాతలకు లాభాల పంట భారీ సినిమాలు విడుదల అవుతుంటాయి. ఒక మోస్తరు సినిమా కూడా నిర్మాతకు లాభాలు తెచ్చిపెడుతుంది. ఈ విషయం లో టాలీవుఢ్ ఒక ఎత్తు అయితే . భారతీయ సినిమా మరో ఎత్తు అని అంటారు. ఎందుకంటే టాలీవుడ్ స్పాన్ చిన్నది అయినా లార్జ్ స్కేల్ లో నిర్మాణాలు జరుపుతారు. ఇక బడ్జెట్ విషయంలో అదుపూ పొదుపూ ఉండదు అని చెబుతారు. ఇక సినిమా కంటెంట్ కంటే కూడా గ్లామర్ తో పాటు కమర్షియల్ అంశాలకే ప్రాధాన్యత ఇస్తారని చెబుతారు. అన్నీ బాగున్న రోజుల్లో అవి హిట్ అయ్యాయి కానీ ఇపుడు కరోనా కాలం కానీ కాలం వచ్చాక సినిమా తెర చిరిగిపోయింది. మరీ ముఖ్యంగా హై బడ్జెట్ మూవీస్ కి గడ్డు రోజులే అంటున్నారు. ఎందుకంటే జనాలు థియేటర్లకు రావడం ఒక పెద్ద సమస్య అయితే కరోనా తరువాత సింగిల్ థియేటర్లు అన్నీ పెద్ద ఎత్తున మూత పడడం మరో కారణం. తెరిచినా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు పెట్టడంతో ఆ మాత్రం వసూళ్లు కూడా తగ్గిపోయాయి.
ఈ నెపధ్యంలో సినిమా గతి ఏంటి అని అంతా ఆందోళన చెందుతున్న వేళ సంక్రాంతి పండుగ వచ్చింది. నిజానికి ఇది అతి పెద్ద సీజన్. టాలీవుడ్ మాత్రం జంకి బాగా వెనక్కి తగ్గింది. దాంతో మూడంటే మూడు తెలుగు సినిమాలు మాత్రమే ఈ సీజన్ లో రిలీజ్ అయ్యాయి. ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా అయితే వాటిలో మాస్ మహారాజా రవితేజా క్రాక్ కలెక్షన్లు దుమ్ము రేపాయి. ఇప్పటికి దాదాపు పద్నాలుగు కోట్లు కలెక్ట్ చేసిన క్రాక్ బ్రేక్ ఈవెన్ కి దగ్గరలో ఉంది. అదే విధంగా రాం రెడ్ మూవీ తొలి రోజు ఆరు కోట్లు వసూల్ చేసింది. అల్లుడు అదుర్స్ చతికిల పడ్డాడు. లాక్ డౌన్ నిబంధనలు, ఫిఫ్టీ పెర్సెంట్ ఆక్యుపెన్సీ ఉన్నా కూడా ఈ రెండు సినిమాలా కలెక్షన్లు చూసిన టాలీవుడ్ షాక్ తిందని అంటున్నారు. మరో మూడు నెలలు అంటే సమ్మర్ కి తమ సినిమాలను వాయిదా వేసుకున్న పెద్ద నిర్మాతలు ఈ కలెక్షన్లకు చూసి నిజంగా పరేషన్ అవుతున్నారు. జనాలు థియేటర్లకు పెద్ద ఎత్తున రావడమే కాకుండా సినిమాలను ఎప్పటి మాదిరిగానే ఆదరించడంతో గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకున్నామన్న బాధ వారిలో ఉందిట. మొత్తానికి సంక్రాంతి ఇచ్చిన ఈ రికవరీ గిఫ్ట్ షాక్ తో సర్దుకుని ఇక వెల్లువలా సినిమాలను రిలీజ్ చేస్తారని అంటున్నారు. అయితే ఈ సమ్మర్ కి సినిమాలు వెల్లువలా విడుదల అవుతాయన్న మాట.













