‘క్రాక్’ ఎక్కిస్తున్నరికార్డు కలెక్షన్లు బయ్యర్స్ కి ఫుల్ ప్రాఫిట్
నవ్విన నాపచేను పండదా అన్నట్లు క్రాక్ విడుదల రోజున నిర్మాత పడ్డ కష్టం అంతా ఇంతా కాదు సెకండ్ షో నుండి ఆటలు పడ్డా సినిమా టాక్ తో ఆ తరువాత ఇక వసూళ్లే వసూళ్లు మాస్ మహారాజా రవితేజ తాజాగా నటించిన సినిమా ‘క్రాక్’… పండగ ముగిసినా కలెక్షన్ల జోరుని మాత్రం ఒక రేంజిలో కొనసాగిస్తుంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. 3 ఏళ్ళ నుండీ సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ చిత్రం పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ‘డాన్‌శీను’, ‘బలుపు’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత `క్రాక్` చిత్రంతో రవితేజ, గోపీచంద్ లు కూడా హ్యాట్రిక్ ను కంప్లీట్ చేశారు.‘క్రాక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 9 రోజులకు గాను ఈ చిత్రం 27.11 కోట్ల షేర్ ను రాబట్టింది.50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఇక ఈ చిత్రం కొన్న బయ్యర్స్ అంతా ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వడం విశేషం!ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు ఇప్పటివరకూ 9కోట్ల వరకూ లాభాలు పొందాయని సినీ ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.













